రైతుల కుంటుంబాలకు పరిహారం చెల్లింపుపై గతంలో ఇచ్చిన ఉత్తర్వులను ప్రభుత్వం సవరించింది. వ్యవసాయంలో నష్టాలతో ఆత్మహత్యకు పాల్పడిన రైతుల కుటుంబాలకు పరిహారంగా గతంలో రూ. 5 లక్షలు ఇచ్చేవారు. కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక దీన్ని రూ. 7 లక్షలకు పెంచుతూ 2019 అక్టోబరు 14న ఉత్తర్వులిచ్చారు. 2019 జూన్ 1 తర్వాత ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకే పెంచిన పరిహారం వర్తిస్తుందని తాజా ఆదేశాల్లో పేర్కొన్నారు.
రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు రు. 35.55 కోట్ల పరిహారం విడుదలైంది. ఆత్మహత్య చేసుకున్న 627 మంది రైతుల కుటుంబాలకు ఈ మొత్తాన్ని అందించాలని ఆదేశిస్తూ వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య ఉత్తర్వలు జారీ చేశారు.
ఇదీ చదవండి : పంచాయతీరాజ్ చట్టంలో సవరణలపై ఆర్డినెన్స్ జారీ