ETV Bharat / city

గతేడాది ఫీజును విద్యార్థులే చెల్లించాలి: హైకోర్టు - ఏఎఫ్​ఆర్​సీ

వృత్తి విద్యా కోర్సుల ఫీజుల చెల్లింపునకు సంబంధించి ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీలపై హైకోర్టు తీర్పు ఇచ్చింది. 2018-19 విద్యా సంవత్సరానికి నిర్ణయించిన ఫీజును విద్యార్థులే చెల్లించాలని పేర్కొంది.

గతేడాది ఫీజును విద్యార్థులే చెల్లించాలి: హైకోర్టు
author img

By

Published : Aug 9, 2019, 7:24 AM IST

వృత్తి విద్యా కోర్సుల ఫీజుల చెల్లింపుపై స్పష్టతనిస్తూ...హైకోర్టు ధర్మాసనం తీర్పు ఇచ్చింది. 2018-19 విద్యా సంవత్సరానికి నిర్ణయించిన రుసుములను విద్యార్థులు చెల్లించాలని తెలిపింది. 2019-20కి ఏఎఫ్ఆర్​సీ నిర్ణయించిన రుసుములో గతంలో చెల్లించిన సొమ్మును మినహాయించగా...మిగిలినదానిలో సగం మెుత్తానికి...విద్యార్థులు బ్యాంకు పూచీకత్తును ఆయా కళాశాలలకు ఇవ్వాలని స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం నూతన రుసుములను ప్రకటించే వరకు ఈ విధానాన్ని అనుసరించాలని పేర్కొంది. ఏఎఫ్​ఆర్​సీ నిర్ణయించిన రుసుములను ఆయా కళాశాలల యాజమాన్యాలకు తెలియజేయాలని సర్కారును ఆదేశించింది. సర్కారు దాఖలు చేసిన అప్పీల్లో భాగంగా...ధర్మాసనం ఈ మేరకు తీర్పు ఇచ్చింది .

గతేడాది ఫీజును విద్యార్థులే చెల్లించాలి: హైకోర్టు

ఇదీ చూడండి: బందరు పోర్టు అభివృద్ధి రాయితీ ఒప్పందం రద్దు

Intro:ఈశ్వరాచారి..... గుంటూరు తూర్పు... కంట్రిబ్యూటర్.

యాంకర్.... ప్రజాస్వామ్యంలో జగన్మోహన్ రెడ్డి లాంటి అరాచకవాది అధికారం కోసం పాకులాడటం శోచనీయమని రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఎండి హిదాయత్ అన్నారు. గుంటూరు తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యం మోడీ ఆదేశాలతో సంక్షేమ పథకాల నిధులు నిలిపి వేధిస్తున్నారని..... విపరీత పోకడలతో రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారన్నారు. పేద రోగులకు ఆర్థిక సహాయం అందజేసే ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు నిలిపివేశారని ఆయన ధ్వజమెత్తారు. మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా నిరుద్యోగ మైనార్టీ యువతకు స్వయం ఉపాధి కోసం 16,380 మందికి సబ్సిడీ పద్ధతిన ఒక్కొక్కరికి లక్ష రూపాయలు చొప్పున 115 కోట్ల రూపాయలు విడుదల చేయగా వాటిని కూడా నిలిపివేశారని మండిపడ్డారు. నిధులు ఆపివేసి సంక్షేమాన్ని అడ్డుకోవడం రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీయడమేనని అన్నారు. దేశంలో ఎక్కడాలేని ఎన్నికల నియమావళి ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే చీఫ్ ఎలక్షన్ కమిషన్ , ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అమలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. జిల్లా అధికారుల నిర్లక్ష్యంతో రిటైరైన అయిన అధికారులు కూడా డ్యూటీ చేశారని ఆరోపించారు. ప్రజా ప్రభుత్వాన్ని పక్కనపెట్టి నియంతలాగా..లేని అధికారాన్ని చెలాయిస్తున్న చీఫ్ సెక్రటరీ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హిదయత్ హెచ్చరించారు .

Body:బైట్....ఎండి.హిదాయత్..రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.