ETV Bharat / city

foreign education ‘విదేశీ సాయం’ అయోమయం - ఆంధ్రప్రదేశి్ జగన్ విదేశి విద్య సాహయం పథకం

Students are confused by the governments rules విజయవాడకు చెందిన విద్యార్థికి కెనడాలోని విశ్వవిద్యాలయంలో చదివేందుకు వీసా వచ్చింది. సెప్టెంబరు ఒకటి నుంచి తరగతులు ప్రారంభం అవుతున్నాయి. మన ప్రభుత్వమేమో ‘విదేశీ విద్య’ పథకానికి  దరఖాస్తుల స్వీకరణకు సెప్టెంబరు 30 వరకు సమయం ఇచ్చింది. తర్వాతే అభ్యర్థులను ఎంపిక చేస్తామంటోంది. తనకు సీటు వచ్చినందున తొందరగా పరిశీలన పూర్తి చేయాలని విద్యార్థి కోరినా అధికారులు పట్టించుకోలేదు. విధిలేక ఆయన కెనడాకు వెళ్లిపోయారు. ఇప్పుడతను ఏం చేయాలో తెలియడంలేదు. ఇది ఈ ఒక్కరి పరిస్థితే కాదు. రాష్ట్రం నుంచి విదేశాలకు వెళుతున్న చాలామంది విద్యార్థులు ఇలాంటి సమస్యనే ఎదుర్కొంటున్నారు.

Students are confused by the governments rules
విదేశీ సాయం’ అయోమయం
author img

By

Published : Sep 5, 2022, 7:49 AM IST

governments rules on foreign education aid scheme విదేశీ విద్య సాయానికి ప్రభుత్వం విధించిన నిబంధనలు విద్యార్థులను అయోమయానికి గురిచేస్తున్నాయి. ప్రభుత్వ ఆర్థిక సాయం కోసం ఎదురు చూడటమా... వీసా వచ్చినందున విదేశాలకు వెళ్లడమా... అనేది తేల్చుకోలేక తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. ప్రభుత్వం మాత్రం విద్యార్థుల సమస్యలను పట్టించుకునే పరిస్థితి కనిపించడం లేదు. సాధారణంగా రాష్ట్రం నుంచి ఎక్కువ మంది విద్యార్థులు అమెరికా, కెనడా, బ్రిటన్‌, ఆస్ట్రేలియాలలో చదువుకునేందుకు వెళ్తుంటారు. అక్కడి విశ్వవిద్యాలయాలు ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో తరగతులు ప్రారంభిస్తాయి. రాష్ట్రంలో విద్యా సంవత్సరం మార్చి, ఏప్రిల్‌లో ముగుస్తున్నందున ముందు నుంచే విద్యార్థులు విదేశీ వర్సిటీలకు దరఖాస్తు చేస్తారు. అన్ని దేశాల్లోని విశ్వవిద్యాలయాలు జులై నుంచి అక్టోబరు వరకు తరగతులు ప్రారంభిస్తాయి. వీటికి ముందు నుంచే ప్రవేశాల దరఖాస్తులు, వీసాల ప్రక్రియ పూర్తవుతుంది.

ఇప్పటికే విదేశీ విద్యకు వీసాలు వచ్చిన వారు దాదాపు 90% మంది వెళ్లిపోయారు. ప్రభుత్వం వీటిని పట్టించుకోకుండా వింత షెడ్యూల్‌ను ప్రకటించింది. సెప్టెంబరు 30 వరకు దరఖాస్తుల స్వీకరణ, ఆ తర్వాత పరిశీలన చేస్తామంది. దీనికి విద్యార్థులు స్వయంగా హాజరు కావాలనే నిబంధన విధించింది. ఇప్పటికే పలువురు విదేశాలకు వెళ్లిపోయారు. మరికొందరు సెప్టెంబరులో వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రభుత్వం విధించిన షెడ్యూల్‌ ప్రకారం అక్టోబరు వరకు ఎదురుచూడాలా? వీసా వచ్చినందున వెళ్లాలా? అనే దానిపై పేద విద్యార్థులు ఎటూ తెల్చుకోలేకపోతున్నారు. ఇప్పటికే విదేశాలకు వెళ్లిన విద్యార్థులు తిరిగి ఎలా వస్తారు? సెప్టెంబరులోనే తరగతులు ప్రారంభమయ్యే వారు అక్టోబరు వరకు నిరీక్షించడం కుదురుతుందా? అనేదాన్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.

ఫీజులు ఎప్పుడు చెల్లిస్తారు?
విదేశీ విద్యకు వెళ్లే విద్యార్థులు ముందుగానే సెమిస్టర్‌ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఆగస్టులోపే ఎక్కువ వర్సిటీలు సెమిస్టర్‌ ఫీజు చెల్లించాలని అడుగుతాయి. ప్రభుత్వం సెప్టెంబరులో దరఖాస్తుల ప్రక్రియ చేపడితే మొదటి సెమిస్టర్‌ ఫీజు చెల్లించేందుకు తీవ్ర జాప్యం జరుగుతుంది. దీంతో విద్యార్థులే అప్పులు చేసి, చెల్లించుకోవాల్సి వస్తుంది. విదేశాల్లోని పాల్‌, స్ప్రింగ్‌ సీజన్‌లకు రెండు నెలల ముందుగానే దరఖాస్తుల స్వీకరణ, ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాలి. అప్పుడు విద్యార్థులకు పరిశీలన కమిటీ ముందు హాజరయ్యేందుకు అవకాశం ఉంటుంది. ఇప్పటికే వీసాలు వచ్చిన విద్యార్థుల్లో కొందరు అధికారులు, మంత్రులను కలిసి సమస్యను విన్నవించినా పట్టించుకోవడం లేదని విమర్శలున్నాయి. ఒకసారి విదేశాలకు వెళ్లిన తర్వాత దరఖాస్తుల పరిశీలన సమయానికి వెనక్కి వచ్చేందుకు ఇబ్బందులు ఏర్పడతాయని, దీనికితోడు పేదలకు ఖర్చులు భారంగా మారతాయని వాపోతున్నారు. రాష్ట్రం నుంచి విదేశాలకు వెళుతున్న చాలామంది విద్యార్థులు ఇలాంటి సమస్యనే ఎదుర్కొంటున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.