3 రాజధానులకు వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తుతున్న వేళ... వికేంద్రీకరణకు మద్దతుగా అనేక ప్రాంతాల్లో వైకాపా దీక్షలు నిర్వహించింది. ఒక రాజధాని వద్దు.... 3 రాజధానులే ముద్దంటూ కర్నూలు, అనంతపురంలో మానవహారం నిర్వహించారు. రాష్ట్రాభివృద్ధి 3 రాజధానులతోనే సాధ్యమవుతుందంటూ... తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట ఎమ్మెల్యే జగ్గిరెడ్డి అన్నారు. ప్రకాశం జిల్లా చీరాలలో... ఆమంచి కృష్ణమోహన్ ఆధ్వర్యంలో వైకాపా కార్యకర్తలు మానవహారం నిర్వహించారు. వికేంద్రీకరణ నిర్ణయం సరైనదేనంటూ... యర్రగొండపాలెంలో ర్యాలీ చేపట్టారు. పాలనా విభజనకు... అన్ని ప్రాంతాల ప్రజలూ మద్దతు తెలపాలని... గన్నవరం వైకాపా నేతలు పిలుపునిచ్చారు. చీపురుపల్లిలో.... మానవహారం చేపట్టారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి.... 3 రాజధానులు అవసరమంటూ.... విశాఖ ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు.
ఇదీ చదవండి: