తెలంగాణలో ఒకటి నుంచి తొమ్మిదో తరగతి వరకు విద్యార్థులందరినీ ఆ రాష్ట్ర ప్రభుత్వం పైతరగతులకు ప్రమోట్ చేసింది. కొవిడ్ నేపథ్యంలో పరీక్షలు లేకుండానే వారిని పైతరగతులకు ప్రమోట్ చేయనున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. విద్యాసంస్థలకు రేపట్నుంచి మే నెలాఖరు వరకు వేసవి సెలవులను కూడా ప్రకటించింది.
ఈ నేపథ్యంలో తొమ్మిదో తరగతి వరకు విద్యార్థులందరినీ 2021-22 విద్యాసంవత్సరంలో పైతరగతులు చదివేలా ప్రమోట్ చేసింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ అన్ ఎయిడెడ్ పాఠశాలల విద్యార్థులకు ఇది వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి ఆదేశాల మేరకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రారామచంద్రన్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఇదీ చూడండి : 'కేసీఆర్ ఖాళీ పోస్టులు నింపు జర...చావులు కొంతమేరకైనా ఆపొచ్చు'