ETV Bharat / city

న్యాయ సమీక్షకు విద్యుత్ బస్సుల టెండర్లు: పేర్ని నాని

విద్యుత్ బస్సుల టెండర్ డాక్యుమెంట్లను న్యాయ సమీక్షకు పంపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆమోదం పొందిన తరువాతే టెండర్లు పిలవాలని అధికారులను సీఎం ఆదేశించారు.

పేర్నినాని
author img

By

Published : Nov 22, 2019, 10:01 PM IST

మీడియాతో మంత్రి పేర్నినాని

ఏపీఎస్ఆర్టీసీకి 350 విద్యుత్ బస్సులు సమకూర్చేందుకు ముఖ్యమంత్రి ఆమోదాన్ని తెలియచేశారని రవాణాశాఖ మంత్రి పేర్ని నాని వెల్లడించారు. 2020 మార్చి నాటికి ఈ బస్సులను సమకూర్చుకుంటామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ లభించే ఈ బస్సుల టెండర్లను ముందుగా న్యాయసమీక్షకు పంపాల్సిందిగా సీఎం సూచించారని మంత్రి తెలిపారు. వీటితో పాటు ఆర్టీసీకి మరో 240 డీజిల్ బస్సులు కూడా కొనుగోలు చేయాలని నిర్ణయించినట్టు మంత్రి వివరించారు. ఇందులో 80 ఏసీ బస్సులు కొనుగోలు చేస్తామని చెప్పారు. బస్సుల కోసం విద్యుత్​ను యూనిట్​కు రూ.5 చొప్పున ఇచ్చేందుకు ఏపీఈఆర్సీ నోటిఫికేషన్ ఇచ్చిందని మంత్రి తెలిపారు.

కేంద్ర సాయం అందేనా

ఫాస్టర్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రికల్ వెహికల్స్(ఫేమ్-2) పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఒక్కో బస్సుకు రూ.33- 55 లక్షలు చొప్పున ఏపీలో 350 బస్సులకు సాయం అందించనుంది. అయితే ఈ పథకం గడువు డిసెంబర్ 15తో ముగుస్తుంది. తాజాగా ప్రభుత్వ నిర్ణయంతో ఈ లోపు న్యాయ సమీక్ష, టెండర్లు సాధ్యమవుతుందా అనేది ఆసక్తికరంగా మారింది.

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.