ETV Bharat / city

రాష్ట్ర అవతరణ దినోత్సవం నిర్వహణకు ఉత్తర్వులు జారీ - రాష్ట్ర అవతరణ దినోత్సవంపై ప్రభుత్వ మార్గదర్శకాలు

నవంబర్ 1వ తేదీన ఏపీ అవతరణ వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం జగన్​...తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో ఉదయం 9 గంటలకు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. అనంతరం మంత్రులు, కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. అన్ని జిల్లాల్లో ఇన్​ఛార్జి మంత్రులు, మంత్రులు, కలెక్టర్లు రాష్ట్ర అవతరణ వేడుకలను నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది.

State formations day
State formations day
author img

By

Published : Oct 30, 2020, 4:43 AM IST

నవంబర్ 1న ఏపీ అవతరణ దినోత్సవాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కొవిడ్ మార్గదర్శకాలను పాటిస్తూ నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ ఉత్తర్వులు ఇచ్చారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఉదయం 9 గంటలకు జాతీయ పతాకాన్ని ఎగురవేసి, అమరజీవి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించనున్నారు.

అనంతరం సీఎం.. మంత్రులు, కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఇన్​ఛార్జి మంత్రులు, మంత్రులు, జిల్లా కలెక్టర్లు రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అలాగే గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ విజయవాడ రాజ్​భవన్​లో జరిగే రాష్ట్ర అవతరణ వేడుకల్లో పాల్గొనేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. దిల్లీలోని ఏపీ భవన్​లో కూడా రాష్ట్ర అవతరణ వేడుకలు జరగనున్నాయి.

ఇదీ చదవండి : కొత్త వైద్య కళాశాలలకు జనవరి 16లోగా టెండర్లు పూర్తి చేయాలి: సీఎం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.