ETV Bharat / city

కొత్తగా స్థానిక ఎన్నికల ప్రక్రియ ప్రారంభించాల్సిందే: విపక్షాలు - local body elections news in ap

sec
sec
author img

By

Published : Oct 28, 2020, 10:09 AM IST

Updated : Oct 28, 2020, 9:56 PM IST

10:05 October 28

మీడియాతో విపక్ష పార్టీల నేతలు

స్థానిక సంస్థల ఎన్నికలను రద్దు చేసి మళ్లీ నిర్వహించాల్సిందేనని విపక్ష పార్టీలు ముక్తకంఠంతో కోరాయి. ఎన్నికల నిర్వహణ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ నిర్వహించిన సమావేశంలో తెలుగుదేశం, భాజపా, సీపీఐ సహా వివిధ పార్టీలు తమ అభిప్రాయాన్ని వెల్లడించాయి. గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు చేసి కొత్తగా ఎన్నికల ప్రక్రియ ప్రారంభించాలని సూచించాయి.

 రాష్ట్రంలో కొవిడ్ కేసులు తగ్గుముఖం పట్టడంతోపాటు వివిధ రాష్ట్రాల్లోనూ ఎన్నికలు నిర్వహిస్తున్న దృష్ట్యా స్థానిక ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం రాజకీయ పార్టీల అభిప్రాయం కోరింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ బుధవారం వివిధ పార్టీల ప్రతినిధులతో విడివిడిగా భేటీ ఆయ్యారు. ఆ పార్టీల నుంచి అభిప్రాయాలు సేకరించారు.

వైకాపాకు ఓటమి భయం: తెదేపా

గత ఎన్నికల నోటిఫికేషన్ రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ ద్వారా స్థానిక ఎన్నికలు నిర్వహించాలని ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం కోరింది. గతంలో అధికారం అండతో వైకాపా బెదిరింపులకు పాల్పడి చేసుకున్న ఏకగ్రీవాలన్నీ రద్దు చేయాలని ఎస్ఈసీని కోరినట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు. రాష్ట్రంలో ఎస్ఈసీకే భద్రత లేదన్న అచ్చెన్న....ఇక ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు ఎలా సాఫీగా జరుగుతాయన్నారు. కేంద్ర పోలీసు బలగాల సమక్షంలో ఎన్నికలు నిర్వహించాలని ఆయన కోరారు. కరోనా ఉద్ధృతంగా ఉన్న సమయంలోనే ఎన్నికలు కావాలని గొడవ చేసిన వైకాపా... ఇప్పుడు ఎందుకు వెనకడుగు వేస్తోందని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల సంఘం సమావేశానికి వైకాపా రాకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు. 

మళ్లీ ఎన్నికలు నిర్వహించాలి..

భాజపా, సీపీఐ, బీఎస్పీ, జనతాదళ్‌ పార్టీలు సైతం పాత ఎన్నికలు నోటిఫికేషన్ రద్దు చేయాలని ఎన్నికల సంఘాన్ని కోరాయి. మళ్లీ కొత్త నోటిఫికేషన్ విడుదల చేసి ఎన్నికల ప్రక్రియ మొదలుపెట్టాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌కు లిఖితపూర్వకంగా సూచించాయి. గతంలో అధికార పార్టీ అక్రమంగా ఏకగ్రీవాలు చేసుకున్న స్థానాలపైనా విచారణ జరిపించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కోరారు. వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న పోలింగ్‌ను పరిశీలించి... ప్రజారోగ్యానికి ఎలాంటి ఇబ్బంది లేకుంటే తక్షణం స్థానిక ఎన్నికలు నిర్వహించవచ్చని రామకృష్ణ వెల్లడించారు.

రాష్ట్రంలో కరోనా కేసులు పూర్తిగా తగ్గుముఖం పట్టనందున...ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించిన తర్వాతే ఎన్నికలకు వెళ్లాలని సీపీఎం స్పష్టం చేసింది. ఎలాంటి వివాదాలకు తావులేకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలని ఆ పార్టీ ప్రతినిధులు ఎస్ఈసీని కోరారు. ముందు నుంచి ఎన్నికల నిర్వహణను వ్యతిరేకిస్తున్న అధికార పార్టీ వైకాపా మాత్రం ఎన్నికల సంఘం నిర్వహించిన సమావేశానికి దూరంగా ఉంది. వైకాపా సహా 6 రాజకీయ పార్టీలు తమ అభిప్రాయాలు వెల్లడించలేదు. 

సీఎస్ ఏం చెప్పారంటే..? 

అనంతరం ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయాలు పొందేందుకు సీఎస్ నీలం సాహ్నీతో ఎస్ఈ​సీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సమావేశమయ్యారు. సాయంత్రం 3 గంటల నుంచి గంట పాటు జరిగిన సమావేశంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి అంశంపై ప్రభుత్వం అభిప్రాయాన్ని తెలుసుకున్నారు. కరోనా వ్యాప్తికి సంబంధించిన పలు రికార్డులను ఎస్​ఈసీ ముందుంచినట్లు తెలిసింది. త్వరలో వైరస్ మరో దఫా వ్యాప్తి ఉందన్న నిపుణుల హెచ్చరికలను ఎస్​ఈసీకి తెలియజేసినట్లు సమాచారం. కరోనా తగ్గాకే ఎన్నికలు నిర్వహిస్తే బాగుటుందనే అభిప్రాయాన్ని తెలియజేశారని సమాచారం.

హైకోర్టు ఏం చెబుతుందో...?

మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలను సత్వరం నిర్వహించాలని హైకోర్టులో కొందరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని ఇప్పటికే విచారణకు స్వీకరించిన హైకోర్టు .. ఎన్నికల నిర్వహణపై అభిప్రాయాన్ని నవంబర్ 4న తెలియజేయాలని ఎస్​ఈసీని ఆదేశించింది. రాజకీయ పార్టీలు, ప్రభుత్వం నుంచి తీసుకున్న అభిప్రాయాలను ఆ రోజున హైకోర్టుకు తెలియజేసే అవకాశాలున్నట్లు ఎన్నికల కమిషన్ వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ రద్దు చేయాలని మెజారిటీ రాజకీయ పక్షాలు రాష్ట్ర ఎన్నికల కమిషన్​ను కోరిన దృష్ట్యా ఇదే అంశాన్ని న్యాయ స్థానం దృష్టికి తీసుకుపోనున్నట్లు తెలిసింది. ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం తరపున తెలియజేసిన అభ్యంతరాలు, అంశాలనూ న్యాయస్థానానికి వివరించనున్నట్లు సమాచారం. అనంతరం న్యాయస్థానం ఆదేశాల మేరకు స్థానిక ఎన్నికల నిర్వహణపై కీలక చర్యలు తీసుకునే అవకాశాలున్నట్లు తెలిసింది.

ఇదీ చదవండి:

 రైతులకు బేడీలు... ఎస్సీలపైనే ఎస్సీ, ఎస్టీ వేధింపుల కేసు

Last Updated : Oct 28, 2020, 9:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.