ప్రభుత్వంతో సంప్రదించకుండా స్థానిక ఎన్నికలు వాయిదా వేశారని... ఎన్నికల సంఘం కార్యదర్శి రామసుందరరెడ్డి పేర్కొన్నారు. ఎన్నికల వాయిదా నోటిపికేషన్‌పై ప్రెస్‌మీట్‌లో నిమ్మగడ్డ సంతకం చేశారని చెప్పారు. ఎన్నికల వాయిదా ప్రక్రియను నిమ్మగడ్డ రహస్యంగా పూర్తి చేశారని రామసుందరరెడ్డి వివరించారు. అధికారుల బదిలీలపై సైతం నిమ్మగడ్డ తమతో సంప్రదించలేదన్నారు. కరోనాపై కేంద్రాన్ని సంప్రదించినట్లు తమకు సమాచారం లేదని రామసుందరరెడ్డి స్పష్టం చేశారు. ఎన్నికల సంఘం స్వతంత్రత కోసం ప్రభుత్వ నిర్ణయం సరైందేనని రామసుందరరెడ్డి అభిప్రాయపడ్డారు.
ఇదీ చదవండీ... ఎస్‌ఈసీ పదవీ కాలం కుదింపు కేసులో కామినేని అఫిడవిట్