ETV Bharat / city

తెలంగాణ: చివరి త్రైమాసికం అంచనాలతో సిద్ధమవుతోన్న రాష్ట్ర బడ్జెట్​ - telangana varthalu

చివరి త్రైమాసికం అంచనాలతో ఆశావహంగా.. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సిద్ధమవుతోంది. కరోనా కష్టకాలంలోనూ స్వల్ప ఆర్థికవృద్ధి నమోదైన నేపథ్యంలో రానున్న ఆర్థిక సంవత్సరంలో వృద్ధి ఇంకా బాగుంటుందని అంచనా వేస్తున్నారు. అందుకు అనుగుణంగా బడ్జెట్ కేటాయింపులు పెరిగే అవకాశం కనిపిస్తోంది. అటు ప్రస్తుత కార్యక్రమాల అమలుతో పాటు హామీల అమలుకు కేటాయింపులు ఉండనున్నాయి. ఎప్పటిలాగే సంక్షేమం, నీటిపారుదల, వ్యవసాయరంగాలకు ప్రాధాన్యం దక్కనుంది.

State budget being prepared from more expectations
తెలంగాణ: చివరి త్రైమాసికం అంచనాలతో సిద్ధమవుతోన్న రాష్ట్ర బడ్జెట్​
author img

By

Published : Mar 15, 2021, 12:08 PM IST

తెలంగాణ: చివరి త్రైమాసికం అంచనాలతో సిద్ధమవుతోన్న రాష్ట్ర బడ్జెట్​

తెలంగాణ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. 2021-22 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్​ను ఈ నెల 18వ తేదీన ప్రవేశపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. బడ్జెట్​కు సంబంధించిన కసరత్తు ఇప్పటికే దాదాపుగా పూర్తైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఖరారు చేసిన విధివిధానాలకు అనుగుణంగా అధికారులు బడ్జెట్ ప్రతిపాదనలను తయారు చేశారు. ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు కూడా ఆయా శాఖల అధికారులతో సమావేశమై ప్రతిపాదనలపై చర్చించారు. తుది కసరత్తు ఇంకా కొనసాగుతోంది. ఒకటి, రెండు రోజుల్లో జరగనున్న మంత్రివర్గ సమావేశంలో బడ్జెట్ ప్రతిపాదనలు ఖరారు కానున్నాయి. కరోనా, లాక్​డౌన్ తదనంతర పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర వార్షికపద్దు సిద్ధమవుతోంది. 2020-21 సంవత్సరానికి లక్షా 82వేల కోట్ల రూపాయలతో బడ్జెట్​ను ప్రభుత్వం ప్రవేశపెట్టింది.

చివరి త్రైమాసికంలో గరిష్టంగా ఆదాయం

కరోనా, లాక్​డౌన్ నేపథ్యంలో ఆర్థికకార్యకలాపాలు మొదట్లో పూర్తిగా స్తంభించగా... ఆ తర్వాత క్రమేణా పుంజుకుంటూ వచ్చాయి. దీంతో ఆర్థిక సంవత్సరం మొదట్లో పూర్తిగా పడిపోయిన ప్రభుత్వ రాబడులు క్రమక్రమంగా పెరుగుతూ వచ్చి చివరి త్రైమాసికానికి గరిష్టానికి చేరుకున్నాయి. కరోనా తదనంతర పరిణామాలతో రాష్ట్రానికి రావాల్సిన రాబడి యాభై వేల కోట్ల వరకు తగ్గిందని ప్రభుత్వం అంచనా వేసింది. ఆదాయంతో పాటు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కూడా తగ్గడంతో ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువగా అప్పులపై ఆధారపడాల్సి వచ్చింది. బడ్జెట్​లో కేవలం 33వేల కోట్ల రూపాయలు పేర్కొనగా... ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి రుణాల మొత్తం 45వేల కోట్ల వరకు చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. జనవరి నెల వరకు రాష్ట్రానికి పన్నుల రాబడి 60వేల కోట్లు రాగా... మొత్తం రెవెన్యూ రాబడులు 75 వేల కోట్ల వరకు ఉన్నాయి. డిసెంబర్ నెలతో పాటు చివరి త్రైమాసికంలో గరిష్టంగా ఆదాయం వస్తోంది.

వాస్తవిక దృక్పథంతో..

అటు బడ్జెట్ ఆశాజనకంగా ఉంటుందని, కేటాయింపులు పెరుగుతాయని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే సూచనప్రాయంగా తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో క్లిష్ట పరిస్థితుల్లోనూ రాష్ట్రం స్వల్పంగా ఆర్థికవృద్ధి నమోదు చేసింది. స్థూలఉత్పత్తిలో దేశ సగటు 3.8శాతం తగ్గుదల నమోదు కాగా... రాష్ట్ర జీఎస్డీపీలో మాత్రం 1.35 శాతం వృద్ధి నమోదైనట్లు అర్థగణాంక శాఖ విశ్లేషించింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఈ వృద్ధిరేటు ఇంకా బాగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. జాతీయస్థాయిలోనే 14శాతం వరకు వృద్ధిరేటు ఉంటుందన్న కేంద్రం అంచనాల నేపథ్యంలో.. రాష్ట్రంలోనూ అంతకంటే ఎక్కువగానే ఉండవచ్చని ఆశావహంగా కనిపిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో రానున్న ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర వార్షికపద్దు సిద్ధమవుతోంది. పూర్తి ఆశాజనకంగా, వాస్తవిక ధృక్పథంతో కొత్త బడ్జెట్ ఉంటుందని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికం ఆదాయ అంచనాల ఆధారంగా బడ్జెట్ కసరత్తు చేస్తున్నారు. అంచనాలను ప్రస్తుత బడ్జెట్​పై కనీసం పదిశాతం పెంచినా రెండు లక్షల కోట్ల మార్కు చేరుకునే అవకాశం ఉంటుంది.

హామీల అమలు కోసం కేటాయింపులు

ప్రస్తుతం కొనసాగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు నిధులను కొనసాగిస్తూనే హామీల అమలు కోసం కేటాయింపులు చేసే అవకాశం ఉంది. అన్నింటికీ పెంపు అన్న సూత్రం కాకుండా నిర్ధేశితంగానే కేటాయింపులు ఉండవచ్చని అంటున్నారు. మరో మూడు లక్షల యూనిట్ల గొర్రెల పంపిణీ, దళితులకు సాధికారత, ఉద్యానవన పంటలకు ప్రత్యేక తోడ్పాటు, ఉద్యోగుల వేతన సవరణ, కొత్త ఫించన్లు, తదితరాలకు నిధులు కేటాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎప్పటిలాగే సంక్షేమం, నీటిపారుదల, వ్యవసాయానికి కేటాయింపుల్లో ప్రాధాన్యత దక్కనుంది.

ఇదీ చదవండి:

గెలుపు - ఓటమి @ నాయకుల బంధుగణం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.