ETV Bharat / city

జాతీయ స్థాయి కబడ్డీ పోటీల్లో అపశ్రుతి - suryapet crime news

తెలంగాణ సూర్యాపేటలో 47వ జాతీయ జూనియర్‌ కబడ్డీ క్రీడల ప్రారంభోత్సవంలో అపశ్రుతి చోటుచేసుకుంది. ప్రేక్షకుల కోసం ఏర్పాటుచేసిన గ్యాలరీ ఒక్కసారిగా కుప్పకూలడం వల్ల విషాదం అలుముకుంది. ప్రమాద సమయంలో గ్యాలరీలో 1500 మంది ప్రేక్షకులు ఉన్నారు. ఈ ఘటనలో 150 నుంచి 200 మంది వరకు గాయాలైనట్లు సమాచారం.

stage collapsed in national kabaddi games suryapet district
జాతీయ స్థాయి కబడ్డీ పోటీల్లో అపశ్రుతి
author img

By

Published : Mar 23, 2021, 7:00 AM IST

ప్రేక్షకుల కేరింతలతో కోలాహలం నెలకొంది. దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన క్రీడాకారులతో సందడిగా మారింది. ఇంతలోనే ఆ ప్రాంతంలో విషాదం అలుముకుంది. మరికొద్దిసేపట్లో జాతీయ కబడ్డీ పోటీల ప్రారంభమవుతాయనగా .. ఒక్కసారిగా ప్రేక్షకుల గ్యాలరీ కుప్పకూలి ఆ ప్రాంతమంతా బీతావాహం నెలకొంది.

జాతీయ స్థాయి కబడ్డీ పోటీల్లో అపశ్రుతి

47వ జాతీయ జూనియర్ కబడ్డీ క్రీడల కోసం వచ్చే ప్రేక్షకుల కోసం 3 గ్యాలరీలు ఏర్పాటు చేశారు. ఒక్కో గ్యాలరీలో 5 వేల మంది కూర్చునేలా సిద్ధం చేశారు. ఒక గ్యాలరీలో సుమారు 1500 మంది ప్రేక్షకులు కూర్చున్న గ్యాలరీ ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో ప్రేక్షకులంతా ఒకరిపై ఒకరు పడిపోయారు. ఆ ప్రాంతంలో అరుపులతో బీతావాహ పరిస్థితి నెలకొంది. ప్రమాదంలో 150 నుంచి 200 మంది వరకు కాళ్లు, చేతులకు గాయాలైనట్లు సమాచారం. క్షతగాత్రులను 108 సిబ్బంది, పోలీసులు సూర్యాపేట ప్రభుత్వాస్పత్రి, ప్రైవేటు ఆస్పత్రులకు తరలించారు. తీవ్రంగా గాయపడిన వారిని హైదరాబాద్‌కు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు.

గ్యాలరీ కూలడంతో వందల సంఖ్యలో ప్రేక్షకులకు గాయాలయ్యాయి. గ్యాలరీ సామర్థ్యానికి మించి ప్రేక్షకులు కూర్చోవడంతో ప్రమాదం చోటుచేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. 90 టన్నుల ఇనుము, 60 టన్నుల కలప ఉపయోగించి స్టేడియం నిర్మాణం చేశారు.

మంత్రి పరామర్శ..

జాతీయ కబడ్డీ పోటీల్లో గ్యాలరీ కూలిన ఘటనపై దర్యాప్తు జరిపిస్తామని ఆ రాష్ట్ర మంత్రి జగదీశ్‌రెడ్డి తెలిపారు. సూర్యాపేట ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఎమ్మెల్యేలు బొల్లం మల్లయ్య యాదవ్, శనంపూడి సైదిరెడ్డి, చిరుమూర్తి లింగయ్యతో కలిసి మంత్రి పరామర్శించారు. ప్రమాదం జరగటం దురదృష్టకరమన్న మంత్రి.. బాధితులకు మెరుగైన వైద్య సహాయం అందిస్తామని తెలిపారు.

నియంత్రించక పోవడం వల్లనే..

ఈ ఘటనపై తెలంగాణ భాజపా అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రుల్లో తీవ్రంగా గాయపడ్డ వారిని.. తక్షణమే హైదరాబాద్​కు తరలించి మెరుగైన చికిత్స అందించాలని కోరారు. గ్యాలరీ సామర్థ్యానికి మించి కూర్చున్నా.. నియంత్రించక పోవడం వల్లనే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోందన్నారు. అందరూ క్షేమంగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.

ఇవీచూడండి: ఎన్నికలు పూర్తై నెల రోజులు దాటినా బాధ్యతలకు నోచుకోని సర్పంచులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.