ETV Bharat / city

జానపదులు సైతం గానంచేస్తున్న యాదాద్రి స్థలపురాణం - telangana varthalu

ఎంత అద్భుతంగా కట్టిఉంటారో ఒకసారి చూసి రావాలి అని ఎవరైనా అనుకునేంతగా ఆకట్టుకున్న భవ్యనిర్మాణం తెలంగాణలోని యాదాద్రి. ఒకప్పటి యాదగిరిగుట్టగా పేరొందిన పంచనరసింహ క్షేత్రం నేడు యాదాద్రిగా అంగరంగ వైభవంగా కళాత్మకశోభతో సిద్ధమైంది. నాలుగు ఉగ్రరూపాల స్వామి, 5వ రూపంలో పరమశాంత స్వరూపుడైన గాధ వింటే కళ్లకు కనబడేది యాదాద్రి ఆలయమే. అదే పాతగుట్ట నుంచి కొత్తగుట్టగా ఆపై నవ్యాద్రి యాదాద్రిగా ఆవిష్కారమైన నూతన ఆలయ విస్తరణ వైభవం.

yadadri temple
యాదగిరిగుట్ట
author img

By

Published : Mar 28, 2021, 8:35 AM IST

యాదగిరి గుట్ట

స్వామీ నృసింహః సకలం నృసింహః అంటూ అంతటా నీవే, అంతా నీవేనయ్యా అని కొలుచుకునే నరసింహస్వామి వెలసిన గుట్టయే నేటి యాదాద్రి. సుక్కలను తాకేటి యాదగిరిగుట్టమీద నరసిమ్మా - యాదగిరీ నరసిమ్మా, సిరిగల్ల మాతల్లి శ్రీలక్ష్మిదేవితోటి - ధరణెల్ల పాలించ కొలువైతివయ్యో నారసిమ్మా అని జానపదులు కూడా పాడుకుంటున్నారంటే ఈ స్థల పురాణం ఎంత ప్రాచుర్యం పొందిందో అర్థం చేసుకోవచ్చు. తెలంగాణలో ఉన్న ఈ పుణ్యక్షేత్ర స్థల పురాణం ఎంతో మహిమాన్వితం. హిరణ్యకశ్యపుడిని సంహరించిన ఉగ్రనారసింహుడు పలు చోట్ల వెలిసినట్లే యాదగిరి కొండపై ఐదు అవతారాలలో పంచ నారసింహునిగా భక్తులకు దర్శనం ఇస్తున్నాడని పురాణాలసారం.

బీజాక్షర మంత్ర సాకార రూపం

లోక కల్యాణార్థం ఇక్కడే గుహలో వెలసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించి ముక్తిని ప్రసాదించాలని కోరిన యాదమహర్షి తపమాచరించిన చెట్టు కూడా యాదాద్రి కొండకు దిగువనే మనకు కనిపిస్తుంది. రాగి యంత్రాలపై, రక్షరేకులపై చూసే త్రికోణ ఆకారంలో ఊహిస్తే స్వామివారి బీజాక్షర మంత్రమైన ఓం శ్రీం హ్రీం క్షౌం కి సాకార రూపం ఈ క్షేత్రం. నరసింహస్వామివారు స్వయంభువుడై వెంకటగిరి కొండపై అమూర్త మూర్తిగా ఓ శిలపై వెలిశారు. అందుకే వేంకటగిరి క్షేత్రం ఓంకార క్షేత్రమయింది. అమ్మవారితో కలసి గుర్రంపై వచ్చి నిలిచిన క్షేత్రం పాతగుట్ట. లక్ష్మీనారసింహునిగా పాతగుట్టపై వెలసి శ్రీంకార క్షేత్రంగా ప్రశస్తమైంది. తన భక్తుల బాధలను వినేందుకు కొలువుదీరేందుకు వచ్చి కూర్చున్న దర్బారు కొత్తగుట‌్ట ఆలయంగా హ్రీంకార క్షేత్రమై విలసిల్లింది. ఈ ఓం, శ్రీం, హ్రీం క్షేత్రాల సమ్మిశ్రిత పుణ్యక్షేత్రమే క్షౌం అనే బీజాక్షర దేవుడైన నరసింహ క్షేత్రం.

అణువణువు ఓంకారనాదం

ఈ పరిసరాలు, ఈ కొండలు గుట్టలు మాత్రమే కాదు.. నరసింహుని చల్లని చూపు ప్రసరించిన ఈ ప్రాంతంలోని అణువణువు, ప్రతీ ప్రాణి ఆఖరికి చెట్లూ చేమలు కూడా ఓంకారనాదమై పుష్పించాయి. తమ శాఖలకు ఓంకార రూపునిచ్చాయి. వేంకటగిరిపైనే నెలకొన్న ఈ అద్భుత ఓంకార వృక్ష దర్శనం ఓ అనుభూతిమయం. ఇక్కడే నారసింహుని పలు మహిమా విశేషాలు కూడా ప్రత్యక్ష నిదర్శనాలుగా నిలిచాయి.

ఇదీ చదవండి:

ఏప్రిల్​ 1 నుంచి అమర్​నాథ్​ యాత్ర రిజిస్ట్రేషన్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.