తెలంగాణలో కరోనా కేసులకు హాట్‌స్పాట్‌గా మారింది రాజధాని హైదరాబాద్. కరోనా నిర్ధరణ పరీక్షల సంఖ్య పెంచటం వల్లే పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నప్పటికీ.. అదొక్కటే కారణంగా కనిపించటం లేదు. ఈ రోజుకీ సామాజిక వ్యాప్తి జరగలేదని ప్రభుత్వం బల్లగుద్ది మరీ చెబుతున్నా... ప్రజలు మాత్రం ఎప్పుడో వ్యాప్తి జరిగిందని బలంగా విశ్వసిస్తున్నారు. తమకు వ్యాధి ఎక్కడ సోకింది అనేది గుర్తించలేని స్థితికి హైదరాబాద్ వెళ్లిపోయిందని వారు అంటున్నారు.
హైదరాబాద్‌లో కేసుల వివరాలు ఇలా మే 31 నాటికి 2,698 ప్రస్తుతం 29,536 జీహెచ్ఎంసీ పరిధిలో 23,223 జూన్‌లో 13,741(సగటున రోజుకు 454 ) జులై తొలి వారంలో 9,227 (రాష్ట్రంలో) జులై 1-8 13,197 (రాష్ట్రంలో) జులైలో సగటున రోజుకు 1650 బుధవారం నాటికి 11,939(యాక్టివ్ కేసులు) కోలుకున్నవారు 17,279 ఇప్పటిదాకా నిర్వహించిన టెస్టులు 1,34,801
కోర్టు మొట్టికాయలు
తెలంగాణ సర్కారుపై ఆ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం కూడా మొట్టికాయలు వేసింది. ప్రభుత్వం విడుదల చేస్తున్న కరోనా నివేదికలపై అభ్యంతరం వ్యక్తం చేసింది. వాటిలో వివరణాత్మక సమాచారం ఎందుకు లేదని ప్రశ్నించింది. టెస్టుల నిర్వహణపైనా అసంతృప్తి వ్యక్తం చేసింది.
నో బెడ్స్ బోర్డులు
కరోనా లక్షణాలు ఉన్న వారు, వారితో కాంటాక్టు ఉన్న వారూ.. వేలాదిగా పరీక్షలకు పోటెత్తటంతో ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. పరిస్థితి చేయి దాటక ముందే.. ప్రైవేటు రంగంలోనూ కరోనా పరీక్షలకు అనుమతించి ఉంటే బాగుండేదని కొందరి అభిప్రాయం. ఆలస్యంగా వారికి అనుమతివ్వటం, అదీ తమకి గిట్టుబాటు కానీ ధరలు నిర‌్ణయించారని ప్రైవేటు ఆసుపత్రులు పెదవి విరవటం వల్ల ఆశించిన ఫలితాలు రావట్లేదు. ఇలాంటి పరిస్థితి మునుపెన్నడూ ఎదుర్కోలేకపోవటం వల్ల వైద్యారోగ్యశాఖ అధికారులు తడబడుతున్నారు. కార్పొరేట్ ఆస్పత్రిల నుంచి సాధారణ నర్సింగ్‌హోమ్‌ల వరకూ "నో బెడ్స్(పడకలు ఖాళీ లేవు)" బోర్డులు పెట్టేశాయి.
హైదరాబాద్‌లో పరిస్థితి దారుణంగా ఉన్నప్పటికీ చాలామంది నగరవాసులు నిర్లక్ష్యాన్ని ఇంకా వీడలేదు. మాస్కులు లేకుండా మార్కెట్లలో జనం విచ్చలవిడిగా తిరుగుతూ స్వీయ నియంత్రణ పాటించకపోవటం కరోనా వ్యాప్తికి కారణం అవుతోంది.