ETV Bharat / city

AP News: మీ ప్రయాణం సురక్షితమగుగాక.. - car caring

సొంత కారుంటే ఆ సౌకర్యమే వేరు. బస్సులు, రైళ్లలో రిజర్వేషన్ల గోల.. ఆటోలు, క్యాబ్‌లు ఎక్కి స్టేషన్లకు వెళ్లే బాధ తప్పుతుంది. ప్రయాణం మనకు అనుకూలంగా ఉంటుంది. మన కారులో మనమే రయ్యి రయ్యిన వెళ్లిపోవడం బాగుంటుంది. కానీ ప్రజారవాణా సాధనాలతో పోల్చితే వీటిలో ప్రయాణం ఎక్కువ ప్రమాదాలను తెచ్చిపెడుతోంది. ఇందులో కొన్ని ప్రాణాంతకమవుతున్నాయి. వాహనం నడిపేవారికి అనుభవం, నైపుణ్యం తక్కువగా ఉండటమే కాదు కార్లలో సరైన రక్షణ వ్యవస్థలు లేకపోవడం కూడా ఇందుకు ప్రధాన కారణాలే. అందుకే ఇప్పుడు వస్తున్న కార్లలో ప్రమాదాలను నివారించడానికి, కనీసం వాటి తీవ్రతను తగ్గించడానికి వీలుగా ఎన్నో అత్యాధునిక రక్షణ వ్యవస్థలు అందుబాటులో ఉంటున్నాయి. కారు కొనేముందు వాటి గురించి తెలుసుకుని సమర్థంగా వినియోగించుకుంటే.. మీ ప్రయాణం సురక్షితం.. సుఖమయం.. శుభప్రదం.

మీ ప్రయాణం సురక్షితమగుగాక
మీ ప్రయాణం సురక్షితమగుగాక
author img

By

Published : Dec 13, 2021, 10:09 AM IST

వాహనంతో రోడ్డెక్కితే ఇంటికొచ్చే వరకూ ప్రమాదం పొంచే ఉంటుంది. కాస్త ఆదమరిచినా కబళించేస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లో ఏటా సగటున 22-24 వేల రోడ్డు ప్రమాదాలు జరుగుతుండగా ఏడెనిమిది వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. దాదాపు 24 వేల మంది గాయాలపాలవుతున్నారు. చిన్నచిన్న తప్పిదాలే పెను ప్రమాదాలకు కారణమవుతున్న వేళ వీటిని సాధ్యమైనంత మేర తప్పించుకునేందుకు హై ఎండ్‌, మిడ్‌ రేంజ్‌ కార్లలో ఇప్పుడు అత్యాధునిక రక్షణ వ్యవస్థలు అందుబాటులో వచ్చాయి. వీటిలో కొన్నింటిని విడిగా కొనుక్కుని కార్లలో అమర్చుకోవచ్చు. తద్వారా ప్రమాదాలకు గురయ్యే అవకాశం తగ్గుతుంది. అందుకే కారు కొనేటప్పుడు ఎంత మైలేజీ ఇస్తాయి? నిర్వహణ ఖర్చు తక్కువ ఉంటుందా? అనే అంశాలతోపాటు వాటిలో ఏయే రక్షిత వ్యవస్థలున్నాయి? అవి ఎలా పని చేస్తాయి? అనే విషయాలనూ పరిగణనలోకి తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలకు కారణాలు, వాటి బారినపడకుండా మనల్ని కాపాడేందుకు కార్లలో వస్తున్న రక్షణ వ్యవస్థలపై ప్రత్యేక కథనం.

ప్రమాదానికి పక్కాగా బ్రేకులు

ప్రమాద కారణం 1

రోడ్డుపై వేగంగా కారు నడుపుతున్నప్పుడు ఎదురుగా వాహనమో, మనుషులో లేదా ఇంకేదైనా అకస్మాత్తుగా అడ్డొస్తే దాన్ని ఢీకొట్టకుండా ఒక్కసారిగా బ్రేకులు వేస్తుంటాం. అయినా కారు వెంటనే ఆగకుండా కొంతమేర ముందుకెళ్లిపోతుంది. ఒక్కోసారి డ్రైవర్‌ స్టీరింగ్‌పై నియంత్రణ కోల్పోతారు. దీంతో ఎదురుగా వచ్చిన వాటిని ఢీకొడుతుంటారు. ఇలా ఏటా వేల ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా జాతీయ, రాష్ట్ర ప్రధాన రహదారులపై వెళుతున్నప్పుడు కూడళ్ల వద్ద సర్వీసు రోడ్లలో నుంచి, పల్లె దారుల నుంచి అకస్మాత్తుగా వాహనాలు దూసుకొస్తుండటంతో ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి.

ఇలాంటి కారణాలతో జరిగిన రోడ్డుప్రమాదాలు 2,835

మృతులు 793

గాయపడ్డవారు 3,010

మీ కార్లలో ఉండాల్సిన రక్షణ వ్యవస్థలేంటి?

* యాంటీ లాక్‌ బ్రేకింగ్‌ సిస్టమ్‌ (ఏబీఎస్‌): కారులో ఈ వ్యవస్థ ఉంటే సడన్‌బ్రేక్‌ వేసినప్పుడు వాహనం అక్కడే ఆగిపోతుంది. ముందుకు జారదు. వాహనంపై డ్రైవరుకు నియంత్రణ ఉంటుంది. అకస్మాత్తుగా ఎదురుగా ఏదైనా అడ్డొచ్చినా వాహనాన్ని పక్కకు తప్పించేందుకు డ్రైవరుకు వీలవుతుంది. ప్రమాదం చోటుచేసుకునే అవకాశం తక్కువ.

* ఎలక్ట్రానిక్‌ బ్రేక్‌ ఫోర్స్‌ డిస్ట్రిబ్యూషన్‌ (ఈబీడీ): బ్రేకు వేసేటప్పుడు కారు 4 చక్రాల్లో దేనికి ఎంత బ్రేక్‌ ఫోర్స్‌ అవసరమో అంతే లభిస్తుంది. వాహనం తక్షణమే నియంత్రణలోకి వచ్చి ప్రమాద ముప్పు తగ్గుతుంది.

* బ్రేక్‌ అసిస్ట్‌ (బీఏ): అకస్మాత్తుగా ఏదైనా వాహనం ఎదురొస్తే డ్రైవరు ఆందోళనకు లోనై పూర్తిగా బ్రేకు వేసే పరిస్థితి ఉండదు. అలాంటి సందర్భాల్లో బ్రేక్‌ అసిస్ట్‌ ఉంటే సెన్సార్లు పని చేసి దానంతట అదే పూర్తి బ్రేకు పడుతుంది.

ముందున్న ముప్పును పసిగట్టేస్తాయి..

ప్రమాద కారణం 2

లారీలు, ఇతర భారీ వాహనాల డ్రైవర్లు విశ్రాంతి కోసమో లేదా వాహనం పాడైందనో వాటిని రోడ్డుపైనే ఆపేస్తుంటారు. కనీసం బ్లింకర్లు వేయరు. ఆ రోడ్డులో వేగంగా వెళ్లే వాహనదారులు.. ఒక్కోసారి ఆగి ఉన్న వాహనాలను దూరం నుంచి గమనించలేరు. దగ్గరకొచ్చాక గమనించి బ్రేకు వేసే లోపే దాన్ని ఢీకొట్టి ప్రమాదాల బారిన పడుతున్నారు. ముందు వెళ్తున్న వాహన వేగంలో ఆకస్మికంగా తేడా వచ్చినప్పుడూ దాన్ని ఊహించకపోవటంతో ఢీకొట్టి ప్రమాదాలు జరుగుతున్నాయి.

ఇలాంటి కారణాలతో జరిగిన ప్రమాదాలు 652

మృతులు 199

గాయపడ్డవారు 834

* అటానమస్‌ ఎమర్జెన్సీ బ్రేకింగ్‌ (ఏఈబీ): మీరు ప్రయాణిస్తున్న వాహనం మరో వాహనానికి దగ్గరగా వెళ్తూ ఢీకొట్టే అవకాశం ఉన్నప్పుడు ఏఈబీ వ్యవస్థ ప్రమాద ముప్పును సెన్సార్ల ద్వారా ముందే పసిగడుతుంది. డ్రైవర్‌ బ్రేకు వేయలేకపోయినా.. దానంతటదే బ్రేకులు పడేలా చేసి వాహనాన్ని ఆపి ప్రమాదాన్ని నివారిస్తుంది లేదా తీవ్రత తగ్గిస్తుంది. కొన్ని సందర్భాల్లో డివైడర్లు, గోడలు వంటి వాటిని ఢీకొని ప్రమాదాలు జరుగుతుంటాయి. అలాంటి వాటికి ఆస్కారమివ్వకుండా ఈ వ్యవస్థ ఉపయోగపడుతుంది.

గీత దాటితే హెచ్చరిక

ప్రమాద కారణం 3

జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌ వేలు, ఇతర ప్రధాన రహదారులపై కారు నడుపుతున్నప్పుడు కొంతమంది లేన్‌ డిసిప్లిన్‌ (వరుస క్రమశిక్షణ) పాటించరు. సరైన సిగ్నల్‌ ఇవ్వకుండా, బ్లింకర్లు ఆన్‌ చేయకుండా, వెనుక నుంచి ఏ వాహనాలు, ఎంత వేగంతో వస్తున్నాయో గమనించకుండా, ముందున్న వాహనాలను అంచనా వేయకుండా తరచూ ఒక లేన్‌ (వరుస) దాటి మరో లేన్‌లోకి వచ్చేస్తుంటారు. దీంతో వెనుక నుంచి వేగంగా వచ్చే వాహనాలు వీటిని ఢీకొట్టటం లేదా ఈ వాహనమే ముందున్న బండిని ఢీకొట్టటమో జరుగుతోంది.

ఇలాంటి కారణాలతో జరిగిన ప్రమాదాలు 5,195
మృతులు 1,543
గాయపడ్డవారు 5,629

మీ కార్లలో రక్షణగా ఏం అమర్చుకోవచ్చు?

* లేన్‌ డిపార్చర్‌ వార్నింగ్‌ (ఎల్‌డీడబ్ల్యూ): సరైన సిగ్నల్‌ ఇవ్వకుండా, బ్లింకర్లు వేయకుండా ఒక లేన్‌ నుంచి మరో వరుసలోకి కారును పోనిస్తుంటే ఈ వ్యవస్థ డ్రైవర్‌ను హెచ్చరిస్తుంది. లేన్‌ తప్పకుండా అప్రమత్తం చేస్తుంది. లేన్‌ కీపింగ్‌ అసిస్టెన్స్‌ అనే మరో ఏర్పాటు ఉంది. వాహనం వరుస దాటితే స్టీరింగ్‌ ఊగి డ్రైవర్‌ను అప్రమత్తం చేస్తుంది.

రెప్ప వాలినా ఒప్పుకోదు

ఇలాంటి కారణాలతో జరిగిన ప్రమాదాలు 2,247

ప్రమాద కారణం 4

ఆధ్యాత్మిక, విహారయాత్రలకు చాలా మంది సొంతంగా డ్రైవ్‌ చేస్తూనో లేదా ఒకే డ్రైవరుతోనే దూర ప్రాంతాలకు వెళుతుంటారు. ఇలాంటప్పుడు వాహనం నడిపేవారికి తగినంత విశ్రాంతి, విరామం లభించదు. నిద్రలేమి, తీవ్ర అలసటవల్ల కారు నడిపేటప్పుడు తెలియకుండానే కళ్లు మూతపడిపోతుంటాయి. ఫలితంగా రెప్పపాటులో ప్రమాదం జరిగిపోతోంది. ప్రధానంగా రాత్రి 12 నుంచి ఉదయం 6 గంటల మధ్య ఇలాంటి ప్రమాదాలు అధికం.

దీనికి పరిష్కారం ఏంటి?

డ్రౌజీనెస్‌ అండ్‌ అటెన్షన్‌ డిటెక్షన్‌ సిస్టమ్‌, స్లీప్‌ డిటెక్షన్‌ అండ్‌ అలర్ట్‌ సిస్టమ్‌, ఫాటిగ్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌: వాహనం నడిపే వ్యక్తి కళ్లు మూతలు పడుతున్నా, స్టీరింగ్‌ తిప్పటంలో తేడాలున్నా, ముఖంలో అలసట కనిపిస్తున్నా, రెప్ప వాలుస్తున్నా.. పైన పేర్కొన్న వ్యవస్థల్లో ఏది ఉన్నా డ్రైవరును అప్రమత్తం చేస్తుంది. కాసేపు విరామం తీసుకోవాలని సూచిస్తుంది. డ్రైవరు విరామం లేకుండా ఎంతసేపటి నుంచి వాహనం నడుపుతున్నారో తెలియజేస్తుంది. ఈ పరికరాలను విడిగా కొనుక్కుని కార్లలో అమర్చుకోవచ్చు.

టైరుకు రక్షాకవచం

ప్రమాద కారణం 5

కారు వేగంగా నడుపుతున్నప్పుడు ఒక్కసారిగా టైర్‌ పేలిపోయి లేదా అందులోని గాలి తగ్గి వాహనం అదుపు తప్పడం. ఇలాంటప్పుడు వాహనం బోల్తాపడటం, వేరే వాటిని ఢీకొట్టడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి.

ఇలాంటి కారణాలతో జరిగిన ప్రమాదాలు 1,070

మృతులు 488

గాయపడ్డవారు 1,357

టైర్‌ ప్రెజర్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌ (టీపీఎంఎస్‌): ఇది ఉంటే కారు టైర్లలో తగినంత గాలి ఉందా? లేదా? అనేది రియల్‌టైమ్‌లో డ్రైవర్‌కు తెలియజేస్తుంది. తక్కువగా ఉంటే డ్రైవర్‌ను హెచ్చరిస్తుంది.

వేగానికి కళ్లెం

ప్రమాద కారణం 6

అతివేగంతో నడపటంవల్ల వాహనం అదుపు తప్పి ముందు వెళ్తున్న వాహనాలను లేదా కల్వర్టులు, డివైడర్లను ఢీకొట్టటం, వంతెన పై నుంచి కిందకు పడిపోవటం, రోడ్డు నుంచి పక్కకు వచ్చేయటం వంటి ప్రమాదాలు జరిగి అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఢీకొట్టేటప్పుడు వాహనంలో మంటలు చెలరేగి, అందులో ఉన్నవారు సజీవ దహనమైపోతున్న ఘటనలూ ఉన్నాయి.

ఇలాంటి ప్రమాదాలు 15,382

మృతులు 5,530

గాయపడ్డవారు 16,844

దీనికి పరిష్కారం ఏమిటి?

ఇంటెలిజెంట్‌ స్పీడ్‌ అసిస్టెన్స్‌: వాహనం గంటకు 80 కిలోమీటర్లకు మించి వేగంతో వెళ్తున్నప్పుడు ఈ వ్యవస్థ వెంటనే డ్రైవరును అప్రమత్తం చేస్తుంది. వేగం అదుపులో ఉండేందుకు ఇది దోహదపడుతుంది.

పొగ‘ముంచకుండా’..

ప్రమాద కారణం 7

చలికాలంలో పొగ మంచు దట్టంగా పడుతుంది. ఉదయం, రాత్రి వేళల్లో ముందు ఏముందో సరిగ్గా కనిపించదు. భారీగా వర్షం పడేటప్పుడూ ఇదే పరిస్థితి. ఇలాంటి సందర్భాల్లో వాహనాలు ఒకదానికొకటి ఢీకొని ప్రమాదాలు జరుగుతున్నాయి.

ఇలాంటి కారణాలతో జరిగిన ప్రమాదాలు 1,040

మృతులు 402

గాయపడ్డవారు 1,152

ఈ సమస్యకు నివారణ మార్గం ఇదీ..

ఫాగ్‌ లైట్స్‌: సాధారణ కారు లైట్లు కొంతదూరమే కాంతి ప్రసరింపజేయగలవు. కారుకు ఫాగ్‌ లైట్లు అమర్చుకుంటే ఎక్కువ దూరం కాంతి పడుతుంది. ముందు ఏముందో, రోడ్డు ఎలా ఉందో స్పష్టంగా కనిపిస్తుంది. ప్రమాదాలు జరగకుండా నియంత్రించేందుకు కొంత ఉపయోగపడుతుంది.

ప్రమాదాలకు ప్రధాన కారణాలివీ..

* అకస్మాత్తుగా ఏదైనా అడ్డమొస్తే దాన్ని తప్పించుకునే క్రమంలో సడెన్‌బ్రేకు వేయటం

* ఆగి ఉన్న వాహనాలను ఢీకొట్టడం

* జాతీయ, రాష్ట్ర రహదారులపై ప్రయాణించేటప్పుడు తగిన సంకేతాలు ఇవ్వకుండా, బ్లింకర్లు వేయకుండా, సరైన అంచనా లేకుండా లేన్‌ మారుతుండటం

* ఓవర్‌టేక్‌ చేయటానికి ప్రయత్నించటం

* నిద్రమత్తు, అలసటలో వాహనం నడపటం

* వాహనాల టైర్లు అకస్మాత్తుగా పేలిపోవటం

* పొగమంచులో వాహనం నడిపేటప్పుడు ముందున్నవి కనిపించకపోవటం

చైల్డ్‌ సీట్‌ యాంకర్లు

కార్లలో పెద్ద వాళ్లు కూర్చొనే సీట్లలోనే చిన్నపిల్లల్ని కూర్చోబెడతాం. కొన్ని సందర్భాల్లో ఒడిలో కూర్చోబెట్టుకుంటాం. వారికి సీటు బెల్టు పట్టదు. ప్రమాదం జరిగినప్పుడు వీరికి ముప్పు ఎక్కువ.

* ఉపయోగం: చిన్న పిల్లలు కూర్చొనేందుకు వీలుగా కాస్త ఎత్తులో సీటు అమర్చుకునేందుకు వీలుగా కార్లలో చైల్డ్‌ సీటు యాంకర్స్‌ ఉంటాయి. వాటిని ఉపయోగించుకుంటే చిన్నపిల్లలకు కూడా సీటు బెల్టు వంటివన్నీ పకడ్బందీగా అమరుతాయి. ప్రమాదం జరిగినా ముప్పు తప్పించుకునే అవకాశం ఉంటుంది.

బ్లైండ్‌ స్పాట్‌ డిటెక్టర్లు

కారు నడిపేటప్పుడు వెనుక నుంచి, పక్క నుంచి ఏయే వాహనాలు వస్తున్నాయో పక్కనున్న అద్దాల (రియర్‌వ్యూ మిర్రర్‌)లో నుంచి గమనించి తదనుగుణంగా వ్యవహరిస్తాం. కొన్ని సందర్భాల్లో మనకు పూర్తిగా వెనుక ఏముందో ఆ అద్దంలో కనిపించదు. కారు రివర్స్‌ చేసేటప్పుడు కూడా ఇలాంటి పరిస్థితే ఉంటుంది. వీటి వల్ల ప్రమాదాలకు ఆస్కారం ఎక్కువ. వాహనంలో బ్లైండ్‌ స్పాట్‌ డిటెక్టర్లుంటే వెనుక వైపుదంతా పూర్తిగా కనిపిస్తుంది. తద్వారా వాహనం నడిపే వ్యక్తి అప్రమత్తమై ప్రమాదాన్ని నివారించొచ్చు.

కార్లలో ఉండాల్సిన మరికొన్ని భద్రతా వ్యవస్థలు

ఇంపాక్ట్‌ సెన్సింగ్‌ డోర్‌ అన్‌లాక్‌
చాలా సందర్భాల్లో రోడ్డు ప్రమాదానికి గురైనప్పుడు... కారు డోర్లు లాక్‌ అయిపోయి క్షతగాత్రులు అందులో చిక్కుకుపోతారు. వారంతట వారు లోపలి నుంచి బయటకు రాలేరు. బయటి నుంచి డోర్లో, అద్దాలో పగలకొట్టాలి. ఈ క్రమంలో జాప్యం జరిగి చికిత్స అందక ప్రాణాలు కోల్పోతున్న సందర్భాలున్నాయి.

ఉపయోగం: కార్లలో ఇంపాక్ట్‌ సెన్సింగ్‌ డోర్‌ అన్‌లాక్‌ వ్యవస్థ ఉంటే ప్రమాదం జరిగిన వెంటనే డోర్లు అన్‌లాక్‌ అయిపోతాయి. అందులో ఉన్నవారు సులువుగా బయటపడొచ్చు. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లి, ప్రాణాలు కాపాడవచ్చు.

డ్యూయల్‌ ఫ్రంట్‌ ఎయిర్‌బ్యాగ్స్‌, సైడ్‌ అండ్‌ కర్టెన్‌ ఎయిర్‌బ్యాగ్స్‌

కారు నడిపేటప్పుడు కొందరు సీటు బెల్టు పెట్టుకోరు. డ్రైవరు పక్కన, వెనుక సీట్లలో కూర్చొన్న వారిలోనూ చాలా మంది సీటు బెల్టు పెట్టుకోవటంపై ఆసక్తి చూపించరు. ఇలాంటి సందర్భాల్లో రోడ్డు ప్రమాదానికి గురైతే బాధితులు తీవ్రంగా గాయపడటం, ప్రాణాలు కోల్పోవడం జరుగుతోంది.

ఉపయోగం: ప్రయాణికులు సీటు బెల్టు పెట్టుకుంటే.. కారు ప్రమాదానికి గురైనప్పుడు డ్యూయల్‌ ఫ్రంట్‌ ఎయిర్‌ బ్యాగ్స్‌ తెరుచుకుంటాయి. గుండె, ఇతర భాగాలకు గాయాలు కాకుండా రక్షణగా నిలుస్తాయి. సైడ్‌ అండ్‌ కర్టెన్‌ ఎయిర్‌బ్యాగ్స్‌ ఉంటే పక్క భాగాల వైపున్న ఎయిర్‌బ్యాగ్స్‌ తెరుచుకుని తీవ్రగాయాలు కాకుండా కాపాడతాయి.

సీటు బెల్టు: చాలా మంది కారు నడిపేటప్పుడు, అందులో కూర్చొని ప్రయాణించేటప్పుడు దుస్తులు నలిగిపోతాయనో, అసౌకర్యంగా ఉంటుందనో ఇలా చిన్న చిన్న సాకులతో సీటు బెల్టు పెట్టుకోవటానికి ఇష్టపడరు. ఈ ధోరణి వల్లే ప్రమాదాలు చోటుచేసుకునేటప్పుడు మరణాలు అధికంగా ఉంటున్నాయి.

* సీటు బెల్టు పెట్టుకోకుండా కారులో ప్రయాణిస్తున్న సందర్భంలో ప్రమాదం జరిగితే ఆ వేగం ధాటికి, ప్రమాద తీవ్రతకు కారు లోపలి నుంచి బయట పడిపోయే అవకాశాలు అధికం. గుండెకు కారు లోపలి భాగాలు బలంగా తగిలి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంటుంది.

ఎన్ని స్టార్లుంటే.. అంత భద్రం

కారు కొనేటప్పుడు గ్లోబల్‌ న్యూ కార్‌ అసెస్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ (ఎన్‌సీఏపీ) ఇచ్చే స్టార్‌ రేటింగ్స్‌ను పరిగణనలోకి తీసుకోవాలి. గరిష్ఠంగా 5 స్టార్లు ఉంటాయి. ‘మోర్‌ స్టార్స్‌.. సేఫ్‌ కార్స్‌’ అనే నినాదాన్ని గుర్తుంచుకోవాలి. 5 స్టార్‌ రేటింగ్‌ ఉంటే ఆ కారు అత్యంత సురక్షితం. స్టార్ల సంఖ్య తగ్గుతున్న కొద్దీ రక్షణ తగ్గుతుందని అర్థం చేసుకోవాలి.

గమనిక: పైన పేర్కొన్నవి మొత్తం అన్ని రకాల వాహనాలతో జరిగిన ప్రమాదాల వివరాలు.
* ఆధారం: కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ నివేదిక-2019

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.