ETV Bharat / city

CHALLAN: పెండింగ్‌ చలాన్ల చెల్లింపు కోసం 'ప్రత్యేక ఆఫర్'​.. నిజమెంత? - viral news on pending challans

వాహనాలపై ఉన్న పెండింగ్​ చలాన్లు చెల్లించేందుకు దసరా సందర్భంగా 'ప్రత్యేక ఆఫర్​' ప్రకటించినట్లు సామాజిక మాధ్యమాల్లో ఓ వార్త వైరల్​ అవుతోంది. అయితే ఆ వార్త నిజం కాదని.. అది తప్పుడు వార్త అని తెలంగాణలోని పోలీస్​ ఉన్నతాధికారులు వెల్లడించారు.

challan
challan
author img

By

Published : Sep 4, 2021, 3:47 PM IST

ట్రాఫిక్‌ నిబంధనలను ఉల్లంఘించిన వాహనదారులకు ట్రాఫిక్‌ పోలీసులు ఈ-చలాన్లు పంపిస్తున్నారు. ఇలా హైదరాబాద్ వ్యాప్తంగా చాలా వాహనాలపై పదుల సంఖ్యలో చలాన్లు, రూ.వేలల్లో జరిమానాలు ఉంటున్నాయి. ఈ క్రమంలో చాలామంది ట్రాఫిక్‌ పోలీసుల నుంచి తప్పించుకొని తిరుగుతుంటారు. ఇలాంటి పరిస్థితికి చెక్‌ పెట్టడానికి తెలంగాణ ప్రభుత్వం, 'దసరా పండగ' సందర్భంగా ప్రత్యేక ఆఫర్‌ ప్రకటించినట్లు సామాజిక మాధ్యమాల్లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది.

50 శాతం రాయితీతో పెండింగ్‌ చలాన్లు చెల్లించే సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు అందులో ఉంది. అక్టోబరు 4 నుంచి 7 వరకు గోషామహల్‌ స్టేడియంలో నిర్వహించే 'ప్రత్యేక లోక్‌ అదాలత్‌' ద్వారా ఇలా చలాన్ల మొత్తాలను చెల్లించవచ్చని అందులో పేర్కొన్నారు. అయితే ఈ వార్త నిజం కాదని.. ఫేక్‌ న్యూస్‌ అని పోలీసు అధికారులు వెల్లడించారు.

ఇదీ చదవండి: farmers problems: బంగారంలాంటి బంతిపూలు.. లాభాల్లేక నేలపాలు..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.