కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్‌సింగ్‌పై హైదరాబాద్‌లోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీచేసింది. ఎంఐఎం దాఖలు చేసిన పరువునష్టం కేసులో విచారణకు హాజరుకానందున.. ఎన్బీడబ్ల్యూ జారీ చేసింది.
ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ డబ్బుల కోసం ఎన్నికల్లో పోటీ చేస్తారని దిగ్విజయ్ సింగ్ అన్నారని.. ఆ వ్యాఖ్యలు తమకు పరువునష్టం కలిగించేలా ఉన్నాయని ఎంఐఎం సంయుక్త కార్యదర్శి హుస్సేన్ అన్వర్.. దిగ్విజయ్ సింగ్ సహా ఓ దినపత్రికపై వ్యాజ్యం దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై ఇవాళ మరోసారి విచారణకు వచ్చింది.
అనారోగ్యంగా కారణంగా.. నేటి విచారణకు మినహాయింపు ఇవ్వాలని కోరుతూ దిగ్విజయ్‌సింగ్ పిటిషన్ దాఖలు చేశారు. దిగ్విజయ్‌సింగ్ ఇప్పటి వరకూ విచారణకు హాజరుకాలేదని న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయన అభ్యర్థనను తోసిపుచ్చింది. నాన్ బెయిలబుల్ వారెంట్ జారీచేస్తూ విచారణను మార్చి 8కి వాయిదా వేసింది.