ETV Bharat / city

ఉద్యోగ విప్లవం సృష్టించిన ఘనత వైకాపాదే: సభాపతి తమ్మినేని - speaker tammineni seetharam latest comments on cm jagan

గ్రామాల్లో యువతికు ఉపాధి అవకాశాలు కల్పించి ఉద్యోగ విప్లవం సృష్టించిన ఘనత వైకాపాదేనని శాసనసభాపతి తమ్మినేని సీతారాం అన్నారు. ప్రభుత్వ సేవలను పల్లెలకు తీసుకువచ్చిన చరిత్ర సీఎం జగన్​కే దక్కిందని వ్యాఖ్యానించారు.

speaker tammineni seetharam
speaker tammineni seetharam
author img

By

Published : Oct 5, 2020, 7:25 PM IST

ప్రతి 50 ఇళ్లకూ ఒక వాలంటీర్​ను నియమించి ప్రభుత్వ పథకాలతో పాటు పాలనను గ్రామాల్లోకి తీసుకొచ్చిన ఘనత సీఎం జగన్​కే దక్కుతుందని స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస మండలం రామచంద్రపురం, సైలాడ గ్రామాల్లో పర్యటించిన ఆయన.... అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. క్యాష్ ట్రాన్స్ఫర్ సిస్టం భారతదేశంలో ఒక్క ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే అమల్లో ఉందన్నారు.

గ్రామాల్లో యువతకి ఉద్యోగం కల్పించి ఉద్యోగ విప్లవాన్ని ముఖ్యమంత్రి జగన్ సృష్టించారన్నారు. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబుపై మండిపడ్డారు. పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలని సీఎం కృషి చేస్తుంటే ప్రతిపక్షాలు కోర్టుకు వెళ్లి స్టేలు తీసుకొచ్చాయని మండిపడ్డారు.

ఇదీ చదవండి:

ఏపీలో ప్రజాప్రతినిధులపై 132 కేసులు పెండింగ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.