ఇదీ చదవండి
'ఇలాంటి తీర్పుతో ప్రజలకు భద్రతాభావం ఏర్పడుతుంది'
సమత హత్యాచారం కేసులో దోషులకు ఉరిశిక్ష పడటంపై పోలీసు శాఖ హర్షం వ్యక్తం చేసింది. ఈ కేసులో తుదితీర్పు వెల్లడించిన ఆదిలాబాద్ ప్రత్యేకకోర్టు... షేక్ బాబు, షేక్ షాబోద్ధీన్, షేక్ మఖ్ధూమ్లను దోషులుగా నిర్ధరిస్తూ... మరణశిక్ష విధించింది. నేరం జరిగిన 66 రోజుల్లో దోషులకు శిక్ష ఖరారైందని ఎస్పీ మల్లారెడ్డి వెల్లడించారు. ముగ్గురు దోషులకు రూ.26 వేలు జరిమానా విధించినట్లు స్పష్టం చేశారు. పైకోర్టుకు అప్పీల్ చేసుకునే హక్కు వారికి ఉందని తెలిపారు. ఇలాంటి తీర్పు వల్ల మహిళలకు, ప్రజలకు భద్రతాభావం ఏర్పడుతుందని వివరించారు.
sp and dsp talk about samatha case