ఐఎండీ అంచనాలకు అనుగుణంగానే నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకటంతో అంతటా ఆశావహ వాతావరణం నెలకొంది. జూన్ నాలుగో తేదీ నాటికి రుతుపవనాలు రాయలసీమలోకి ప్రవేశిస్తాయని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. ప్రస్తుతం అన్ని చోట్లా సాధారణ పరిస్థితులే ఉండటంతో ఇవి వేగంగా విస్తరిస్తున్నట్టు అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్ స్టెల్లా తెలిపారు.
అరేబియా సముద్రంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా రుతుపవనాలు మరింతగా విస్తరిస్తాయని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. మరోవైపు ఈ వాయుగుండం మరింత బలపడి తుపానుగా మారే అవకాశముందని వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణల్లో వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు.
ఇవీ చదవండి: