వినాయక చవితి నిర్వహణకు అనుమతి ఇవ్వాలని భాజపా రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు డిమాండ్ చేశారు. ఈ మేరకు హోంమంత్రి మేకతోటి సుచరితకు లేఖ రాశారు. ఇతర మతాలకు ఎలా షరతులతో అనుమతించారో.. ఇప్పుడూ అలాగే ఇవ్వాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. ఎవరి ఇళ్లలో వారు 3అడుగుల లోపు విగ్రహాలు ఏర్పాటు చేసుకుంటారని.. నిమజ్జనం ప్రక్రియ కూడా ఇళ్లలోనే పూర్తి చేస్తారని తెలిపారు.
ఇక హిందూ ఆలయాల్లో 10మంది మించకుండా పూజలకు అనుమతివ్వాలని సోము వీర్రాజు కోరారు. బహిరంగ ప్రదేశాల్లో విగ్రహాల ఏర్పాటు ఉండదని... సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రసాదాల పంపిణి వంటివి కూడా ఉండవని లేఖలో పేర్కొన్నారు. భారతదేశ సంస్కృతిలో, హిందూ సంప్రదాయాల్లో వినాయకుడికి ప్రత్యేక స్థానం ఉందన్నారు. అలాంటి విశిష్టత దృష్ట్యా హిందువుల మనోభావాలను గౌరవించాలని కోరారు.
ఇదీ చదవండి: ఫోన్ ట్యాపింగ్ తేలిగ్గా తీసుకోం.. జోక్ అనుకుంటున్నారా?: హైకోర్టు