సామాజిక కార్యకర్త స్వామి అగ్నివేశ్ తుదిశ్వాస విడిచారు. తీవ్ర అనారోగ్యం, కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన.. దిల్లీలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ లివర్ అండ్ బిలియరీ సైన్సెస్ ఆసుపత్రిలో శుక్రవారం కన్నుమూశారు.
సామాజికవేత్త స్వామి అగ్నివేశ్ అలియాస్ వేపా శ్యామ్‌రావు. ఉమ్మడి మద్రాస్‌లోని (ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్) శ్రీకాకుళం జిల్లాలో 21 సెప్టెంబర్ 1939లో జన్మించారు. అగ్నివేశ్ నాలుగేళ్ల వయస్సులో ఉండగానే తండ్రి చనిపోయారు. వాణిజ్య, న్యాయశాస్త్రంలోని పట్టభద్రుడైన అగ్నివేశ్... అనంతరం కోల్‌కత్తాలోని సెయింట్ జెవియర్స్ కళాశాలలో లెక్చరర్‌గా పని చేశారు.
1970లో ఆర్య సభ అనే పేరుతో రాజకీయ పార్టీ ఏర్పాటు
1977లో హరియాణా శాసనసభకు ఎన్నిక(విద్యాశాఖ మంత్రిగా సేవలందించారు)
1981లో వెట్టిచాకిరి విముక్తి వేదిక స్థాపన
తెలంగాణ ఉద్యమానికి మద్దతు..
ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి స్వామి అగ్నివేశ్ మద్దతు పలికారు. అంతేకాదు పలుసార్లు ఉద్యమానికి మద్దతుగా బహిరంగ సభల్లోనూ పాల్గొన్నారు.
మావోలతో చర్చలు...
2011 ఫిబ్రవరిలో మావోయిస్టు పార్టీ ఐదుగురు పోలీసులను అపహరించినప్పుడు వారి విడుదల కోసం పౌర హక్కుల నేతలు చర్చలు జరిపారు. వారిలో అగ్నివేశ్ కూడా ఒకరు. అవినీతికి వ్యతిరేకంగా సామాజికవేత్త అన్నా హజారే చేపట్టిన ఉద్యమంలోనూ స్వామి అగ్నివేశ్ క్రియాశీలంగా పాల్గొన్నారు.
అవార్డులు..
రాజీవ్‌గాంధీ జాతీయ సద్భావన అవార్డు (దిల్లీ - భారత్)
రైట్ లైవ్లీహుడ్ అవార్డు (స్వీడన్)
ఎం.ఎ.థామస్ జాతీయ హక్కుల అవార్డు (బెంగళూరు)
ఇదీ చదవండి