ETV Bharat / city

తెలంగాణ: అంగన్​వాడీ కేంద్రంలో 30 పాము పిల్లలు, 2తేళ్లు - anganwadi center in mahabubabad district

అంగన్​వాడీ కేంద్రంలో గదిని శుభ్రం చేస్తుండగా.. ఓ బండ కింద నుంచి 30 పాము పిల్లలు, 2 తేళ్లు బయటకు వచ్చాయి. ఆ సమయానికి కేంద్రంలో పిల్లలు లేకపోవడం వల్ల ప్రమాదం తప్పింది. ఈ సంఘటన తెలంగాణ మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం బ్రాహ్మణకొత్తపల్లిలో చోటుచేసుకుంది.

Snakes at the Mahabubabad Anganwadi Center
అంగన్​వాడీ కేంద్రంలో 30 పాము పిల్లలు, 2తేళ్లు
author img

By

Published : Mar 23, 2021, 8:30 AM IST

తెలంగాణ మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం బ్రాహ్మణ కొత్తపల్లి అంగన్​వాడీ కేంద్రంలో పాములు కలకలం సృష్టించాయి. గదిని శుభ్రం చేస్తుండగా బండల మధ్యలో మెుదటగా ఒక పాము ఆయాకు కనపడింది. స్థానికుల సాయంతో ఆ పామును చంపగా... అందులోనుంచి వరుసగా 30 పాము పిల్లలు, 2 తేళ్లు బయటకు వచ్చాయి. వాటన్నింటినీ చంపి బయట పడేశారు.

సమయానికి అంగన్​వాడీ కేంద్రంలో పిల్లలు ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలోని ఓ గదిలో అంగన్​వాడీ కేంద్రం నడుస్తోంది. భవనం శిథిలావస్థకు చేరుకోవడంతోనే పాములు, తేళ్లు వస్తున్నాయని... వెంటనే అక్కడి నుంచి అంగన్​వాడీ కేంద్రాన్ని తరలించాలని గ్రామస్థులు కోరుతున్నారు. కొవిడ్ నిబంధనల ప్రకారం ఆహారాన్ని ఇంటివద్దకే అందిస్తుండటంతో అంగన్​వాడీ కేంద్రానికి ఎవరూ రావడం లేదు.

అంగన్​వాడీ కేంద్రంలో 30 పాము పిల్లలు, 2తేళ్లు

ఇదీ చదవండి: నియోజకవర్గానికి ఒక వాహనం..వెటర్నరీ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.