ఇంటింటికీ రేషన్ పంపిణీ కోసం షెడ్యూల్ కులాలకు చెందిన లబ్ధిదారులకు మినీ ట్రక్కులు అందజేసేందుకు ఉద్దేశించిన ఉత్తర్వుల్లో రాష్ట్ర ప్రభుత్వం స్వల్ప మార్పులు చేసింది. మినీ ట్రక్కుల కొనుగోళ్లకు ఇచ్చే 90 శాతం మేర రాయితీ మొత్తాన్ని నేరుగా లబ్ధిదారుల రుణ ఖాతాలకు చెల్లించాల్సిందిగా సాంఘిక సంక్షేమ కార్పొరేషన్‌ను ప్రభుత్వం ఆదేశించింది. మినీ ట్రక్కు వాహనాల కొనుగోలు సబ్సిడీ మొత్తాన్ని 60 శాతం నుంచి 90 శాతానికి పెంచుతూ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు ఇచ్చింది. మిగిలిన 10 శాతాన్ని 72 నెలల్లో వాయిదాలుగా చెల్లించేందుకు అవకాశం కల్పిస్తూ.. ఆదేశాలు జారీ చేశారు.
మొత్తం 2వేల 300 మినీ ట్రక్కులు కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. షెడ్యూల్ కులాల యువతకు సుస్థిర జీవనోపాధి, ఆర్థికంగా చేయూతను ఇవ్వటమే లక్ష్యంగా మినీ ట్రక్కులను యువతకు ఇవ్వనున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది.
ఇదీ చదవండి..
GOVT LANDS: స్మార్ట్ టౌన్‌ల నిర్మాణం కోసం.. 'నిరుపయోగ భూములు'!