FARMERS MAHAPADAYATRA : అమరావతి రైతుల మహాపాదయాత్ర నేడు ఆరో రోజుకు చేరుకుంది. ఇవాళ బాపట్ల జిల్లా ఐలవరం నుంచి రాజధాని రైతుల పాదయాత్ర ఉత్సాహంగా ప్రారంభమైంది. ఏకైక రాజధాని సంకల్పంతో.. రెట్టించిన ఉత్సాహంతో పాదయాత్ర కొనసాగుతోంది. ఇవాళ కనగాల, రాజవోలు, తూర్పుపాలెం మీదుగా రైతుల పాదయాత్ర సాగనుంది. సాయంత్రానికి నగరం చేరుకోనున్న రైతులు.. ఈ రాత్రికి అక్కడే బసచేయనున్నారు.
బాపట్లలో ఫ్లేక్సీల రగడ : బాపట్ల జిల్లాలో మొదలైన మహాయాత్రకు వ్యతిరేకంగా వైకాపా నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. యాత్ర జరిగే రహదారి వెంట.. ఒక రాజధాని వద్దు.. మూడు రాజధానులు ముద్దు అంటూ బ్యానర్లు కట్టారు. గ్రాఫిక్ పాలన వద్దు సంక్షేమ పాలన ముద్దు అని ఫ్లెక్సీలపై రాశారు.
ఇవీ చదవండి: