కాకినాడ జిల్లా పిఠాపురం మండలం చిత్రాడలో భారీగా ఈదురుగాలులు వీచాయి. ఈ క్రమంలో కూరగాయల దుకాణంపై తెగిపడిన విద్యుత్ తీగలు తగిలి దుకాణ యజమాని బస్వా నూకరాజు(45) ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటణలో మరో ఇద్దరికి గాయాలుకాగా.. కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
నంద్యాల జిల్లా వెలుగోడు మండలం బోయిరేవులలో వివాహమైన కొన్ని గంటలకే వరుడు మృతి చెందడం కలవరపరిచింది. వెలుగోడు సమీపంలోని మోత్కూరు వద్ద వరుడు శివకుమార్ తెల్లవారుజామున రోడ్డుపై వెళ్తుండగా వాహనం ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు.
గుంటూరు జిల్లా తాడేపల్లి నులకపేట సెంటర్‌లో విద్యుదాఘాతంతో ఒకరు మృతి ప్రాణాలు కోల్పోయారు. కల్యాణ మండపం సమీపంలో విద్యుత్ తీగలు తగిలి విజయవాడ కృష్ణలంకకు చెందిన భవన నిర్మాణ కార్మికుడు మృతి చెందాడు.
గుంటూరు జిల్లా పొన్నూరు మండలం ఆలూరులో యువకుడు హత్య గురయ్యాడు. కుమార్ అనే యువకుడి తలపై దుండగులు... ఇనుప రాడ్‌తో కొట్టిచంపారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వివాహేతర సంబంధమే హత్యకు కారణమని భావిస్తున్నట్లు తెలిపారు.
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం కోటకందుకూరులో తండ్రిని కుమారుడు హత్యచేసిన ఘటనలో కలకలం రేపింది. తండ్రి నారాయణను కుమారుడు పవన్‌కుమార్ గొడ్డలితో నరికి చంపాడు. ఘటనాస్థలాన్ని పరిశీలించిన పోలీసులు... కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
కడప శివారులోని రాయచోటి రైల్వేగేటు వద్ద రైలు కిందపడి పుట్టపర్తి నగర పంచాయతీ కమిషనర్ మునికుమార్ మృతి చెందాడు. కడప నగర పాలక కార్యాలయంలో సూపరింటెండెంట్‌గా ఉన్న మునికుమార్... మూడు నెలల క్రితం పుట్టపర్తికి డిప్యుటేషన్‌పై వచ్చారని అధికారులు తెలిపారు. రెండు రోజుల క్రితం మునికుమార్... పుట్టపర్తి నుంచి కడప వచ్చినట్లు చెప్పారు.
వైఎస్సార్ జిల్లా ఒంటిమిట్ట చెరువు వద్ద లారీ-కారు ఢీకొని పలువురికి గాయాలయ్యాయి. అరగంటకు పైగా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.
ఇవీ చదవండి: