హైదరాబాద్‌లోని ఎల్బీస్టేడియంలో శాట్స్ కోచ్‌లు మెరుపు ఆందోళనకు దిగారు. 27 ఏళ్లుగా ఒప్పంద కోచ్‌లుగా పని చేస్తున్న తమను రెగ్యులరైజ్ చేయాలంటూ.. ఎండీ కార్యాలయం ముందు బైఠాయించారు. రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఛైర్మన్ అల్లిపూరం వెంకటేశ్వర్‌రెడ్డిని లోపలికి రాకుండా కారుకు అడ్డంగా పడుకున్నారు. తమ ఉద్యోగాలు క్రమబద్ధీకరించాలని ప్రభుత్వ పెద్దలను ఎన్నిసార్లు వేడుకున్నా స్పందన లేదన్నారు. తెలంగాణ వచ్చాకైనా తమ బతుకులు బాగుపడతాయనుకుంటే.. దుర్భరంగా మరాయన్నారు. జీతాలు కూడా సమయానికి ఇవ్వడం లేదని వాపోయారు.
రాష్ట్రం ఏర్పడ్డాక కోచ్లకి గానీ... క్రీడలకు గాని రాష్ట్ర ప్రభుత్వం చేసిందేమీ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 33 జిల్లాలో 330 మంది కోచ్‌లు అవసరం ఉంటే.. ప్రస్తుతం ఉన్నది కేవలం నలుగురు రెగ్యులర్ కోచ్‌లు మాత్రమే ఉన్నారని తెలిపారు. అదే క్రీడా శాఖ, శాట్స్ అడ్మినిస్ట్రేషన్‌లో మాత్రం 200 మంది ఉన్నారని... ఇదెక్కడి న్యాయమని ప్రశ్నించారు. తమ సమస్యలను పెడచెవిన పెడుతున్న ఛైర్మెన్ వెంటనే రాజీనామా చేయాాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలను పరిష్కరించాలని మంత్రి కేటీఆర్... 3 నెలల ముందు అధికారులకు సూచించారని... అయినా ఎక్కడి ఫైల్స్ అక్కడే ఉన్నాయన్నారు. తమ సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లేందుకే ధర్నా చేస్తున్నామన్నారు.
ఇదీ చూడండి: