ETV Bharat / city

శ్రావణి కేసులో సీరియల్​ మలుపులు... కీలకంగా మారిన కాల్​ రికార్డింగ్స్​ - అంతా ఫోన్​ సంభాషణల్లోనే...

బుల్లితెర నటి శ్రావణి ఆత్మహత్య కేసు పలు మలుపులు తిరుగుతోంది. తనకు పరిచయం ఉన్న దేవరాజ్ వేధింపుల వల్లే శ్రావణి చనిపోయిందని కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. కానీ శ్రావణి దేవరాజ్‌తో మాట్లాడిన ఫోన్‌ సంభాషణలో తన ఆత్మహత్యకు కారణం సాయి అంటూ తెలిపింది. ఈ కేసులో ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు కాల్‌ రికార్డ్స్‌ కీలకం కానున్నాయి.

serial actor sravani suicide full story
శ్రావణి కేసులో సీరియల్​ మలుపులు
author img

By

Published : Sep 10, 2020, 9:24 AM IST

బలన్మరణానికి పాల్పడ్డ సీరియల్ నటి శ్రావణి కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. నటిగా పలు సీరియళ్లలో నటించి మంచి పేరు తెచ్చుకున్న శ్రావణి... అనూహ్యంగా ఆత్మహత్య చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. మొన్న రాత్రి చివరిగా దేవరాజ్‌తో మాట్లాడిన శ్రావణి... సాయి అనే వ్యక్తి వల్లే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ చెప్పింది. కానీ కుటుంబసభ్యులు మాత్రం దేవరాజ్ వేధింపుల కారణంగానే చనిపోయిందంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు.

అంతా ఫోన్​ సంభాషణల్లోనే...

ప్రస్తుతం దేవరాజ్, శ్రావణి మధ్య జరిగిన ఫోన్ సంభాషణలు కీలకంగా మారాయి. 5ఏళ్లుగా సాయికృష్ణా రెడ్డి అనే వ్యక్తిని ప్రేమిస్తోందని.. అతని వేధింపులు తట్టుకోలేక టిక్‌టాక్ ద్వారా శ్రావణి తనకి దగ్గరైందని దేవరాజ్ చెబుతున్నారు. అనంతరం శ్రావణి ఇంట్లో కొన్ని నెలలు ఉన్నానని తనతో పాటు ఆడిషన్స్‌కి తీసుకువెళ్లేదని దేవరాజ్ తెలిపారు. శ్రావణి తనకు దగ్గరవుతుందని తెలిసి... సాయి, శ్రావణి తమ్ముడు శివ, మరో వ్యక్తి అశోక్‌రెడ్డి ప్రోద్బలంతో తనపై పోలీసు స్టేషన్లో కేసు పెట్టిందని దేవరాజ్‌ అంటున్నారు. తాను శ్రావణి ఇంట్లో ఉన్న విషయం సాయికి తెలియకుండా జాగ్రత్త పడిందని అన్నారు. ఈ పూర్తి విషయంపై శ్రావణి తల్లిదండ్రులు, సాయి ఆమెను వేధించేవారని... వారి వేధింపులు తట్టుకోలేకపోతున్నానని తనకు ఫోన్‌ చేసి చెప్పిందని... ఆ ఫోన్‌ సంభాషణలను దేవరాజ్‌ బయటపెట్టారు.

మంచి అనుబంధం ఉంది...

మరోవైపు దేవరాజ్ చేసిన ఆరోపణలు అవాస్తవమని... సాయికృష్ణ రెడ్డి అన్నారు. శ్రావణి కుటుంబంతో తనకు మంచి అనుబంధం ఉందని.... ఆమె ఆత్మహత్యకు కారణం తాను కాదని తెలిపారు. శ్రావణి ఆత్మహత్య చేసుకున్నప్పటి నుంచి తాను వారి కుటుంబంతోనే ఉన్నానని వెల్లడించారు.

దేవరాజ్​ను విచారించనున్న పోలీసులు...

మొత్తంమీద ఈ కేసులో కాల్ రికార్డ్స్ కీలకంగా మారనున్నాయి. అయితే జూన్ 22 న దేవరాజ్ తనని వేధిస్తున్నాడని శ్రావణి ఫిర్యాదు చేయడంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్‌కి తరలించారు. ఈరోజు దేవరాజ్‌ను విచారించనున్నారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ గొల్లప్రోలుకు చెందిన కొండపల్లి శ్రావణి కుటుంబంతో సహా ఎనిమిదేళ్ల క్రితం హైదరాబాద్‌ వచ్చారు. మధురానగర్‌లో ఉంటున్న శ్రావణి.. సీరియళ్లలో అవకాశాలు రాగా పలు ఛానళ్లలో నటించారు. కొన్నేళ్ల క్రితం దేవరాజ్‌ టిక్‌టాక్ ద్వారా పరిచయం అయ్యాడు. గత సెప్టెంబర్‌లో నగరానికి వచ్చిన దేవరాజ్‌... శ్రావణి కుటుంబంతో కలిసి ఉన్నాడు.

ఈ వివాదం ఇలా ఉండగానే.. మంగళవారం రాత్రి అనూహ్యంగా శ్రావణి ఆత్మహత్య చేసుకుంది. ఉదయాన్నే షూటింగ్ ఉందని గదిలోకి వెళ్లిన ఆమె.. ఎంతకీ బయటకు రాలేదు. కుటుంబ సభ్యులు గమనించగా శ్రావణి విగతజీవిగా పడిఉంది.

ఇదీ చదవండి: ఇంట్లో ఉంటే వైద్యం అందదంతే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.