ETV Bharat / city

BONALU: ప్రారంభమైన లష్కర్​ బోనాలు.. పోటెత్తిన భక్తులు - lashkar bonalu latest news

లష్కర్​ బోనాల ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్​యాదవ్ అమ్మవారికి తొలిబోనాన్ని సమర్పించారు. రెండు రోజుల పాటు జరగనున్న వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మంత్రి వివరించారు. భక్తులకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా సకల వసతులు కల్పించామన్నారు.

సికింద్రాబాద్ బోనాలు
సికింద్రాబాద్ బోనాలు
author img

By

Published : Jul 25, 2021, 6:38 AM IST

BONALU: ప్రారంభమైన లష్కర్​ బోనాలు.. పోటెత్తిన భక్తులు

సికింద్రాబాద్​లో లష్కర్‌ బోనాల ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​ కుటుంబం అమ్మవారికి తొలిబోనాన్ని సమర్పించింది. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శంచుకునేందుకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. బోనం ఎత్తుకుని వచ్చే మహిళా భక్తుల కోసం ప్రత్యేక క్యూ లైన్‌లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

జాతర సందర్భంగా 2,500 మంది పోలీసులతో బందోబస్తు చేపట్టారు. మాస్కు ధరించని వారిని అమ్మవారి దర్శనం కోసం అనుమతించమని పోలీసులు తెలిపారు. ఈ ఉదయం సీఎం కేసీఆర్‌ సహా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, వివిధ పార్టీల నేతలు మహంకాళి అమ్మవారిని దర్శించుకోనున్నారు.

ప్రధాన ఆకర్షణగా తొట్టెలు..

15 రోజుల పాటు జరిగే బోనాల వేడుక ఆషాఢమాసం మొదటి ఆదివారం ఘటోత్సవంతో ప్రారంభమవుతుంది. మూడో ఆదివారం వేలాది మంది ప్రజలు అక్కడి అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు. రెండ్రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో మొదటి రోజు బోనాలు, రెండోరోజు రంగం కార్యక్రమం నిర్వహిస్తారు. భక్తులు అమ్మవారికి బోనంతో పాటు సాకను సమర్పిస్తారు. అమ్మవారికి ఇష్టమైన పదార్థాలను ఇంట్లో తయారు చేసుకుని.. ఓ బండిలో పెట్టుకుని ఊరేగిస్తూ వచ్చి.. అమ్మవారికి సమర్పించి మిగిలినది మహా ప్రసాదంగా అందరూ పంచుకుని తింటారు. వీటినే ఫలహార బండ్లు అంటారు. ఈ ఉత్సవంలో మరో ప్రధాన ఆకర్షణ తొట్టెలు. రంగురంగుల అట్టలతో తయారు చేసిన తొట్టెలను.. ఊరేగింపుగా తీసుకొచ్చి మొక్కు తీర్చుకుంటారు.

ఆ మహిళతో భవిష్యవాణి..

ఒళ్లంతా పసుపు పూసుకుని నృత్యం చేస్తూ భక్తులను పోతురాజులు రంజింపజేస్తారు. బోనాల మరుసటి రోజు రంగం కార్యక్రమం ఉంటుంది. ఇందులో భాగంగా అవివాహిత మహిళ.. పచ్చి కుండపై నిలబడి భవిష్యవాణి వినిపించనుంది. బోనాల ఉత్సవాలకు పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తం 2,500 మంది పోలీసు అధికారులు, సిబ్బందితో బందోబస్తు నిర్వహించనున్నారు. రంగం తర్వాత అమ్మవారి చిత్రపటాన్ని ప్రత్యేకంగా అలంకరించిన ఏనుగుపై ఉంచి... మంగళ వాయిద్యాలు, కళాకారులు, ఆటపాటలతో ఊరేగించుకుంటూ.. సాగనంపడంతో బోనాల సంబురం ముగుస్తుంది.

ఉజ్జయిని మహంకాళి ఆలయంలో ఏర్పాట్లు పూర్తి..

ఉజ్జయిని మహంకాళి ఆలయం పరిసరాల్లో ఇప్పటికే దేవాదాయ శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. అమ్మవారిని దర్శంచుకునేందుకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకున్నారు. తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. బోనం ఎత్తుకుని వచ్చే మహిళ భక్తుల కోసం ప్రత్యేక క్యూ లైన్‌లు ఏర్పాటు చేశారు. 2500 మంది పోలీసులతో బందోబస్తు చేపట్టారు. మాస్కు ధరించని వారిని అమ్మవారి దర్శనం కోసం అనుమతించమని పోలీసులు తెలిపారు. ఈ ఉదయం సీఎం కేసీఆర్‌ సహా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వివిధ పార్టీల నేతలు మహంకాళి అమ్మవారిని దర్శించుకోనున్నారు.

ఇదీ చూడండి: పోలీసుల ప్రొటోకాల్​.. ట్రాఫిక్​ డ్యూటీలో డాక్టర్​.. హెంమంత్రి ఫైర్​..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.