Secretariat employees probation: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లరేషన్ ప్రక్రియ ప్రారంభమైనట్లు ఏపీ సచివలయా ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కె. వెంకట్రామిరెడ్డి వెల్లడించారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లరేషన్ ప్రక్రియ విశాఖ నుంచి మొదలైందని తెలిపారు. విశాఖ జిల్లాలో వి.మాడుగుల, దేవరాపల్లి , రావికమతం మండలాల పరిధిలోని దాదాపు 30 మంది వెల్ఫేర్ అసిస్టెంట్ల ప్రొబేషన్ డిక్లేర్ చేస్తూ ఆ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారని వివరించారు.
రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లేర్ చేయాలని ప్రభుత్వం సెప్టెంబర్ 29వ తేదీన ఉత్తర్వులు జారీ చేసిందని.. అందుకు అనుగుణంగానే క్షేత్ర స్థాయిలో ఈ ఉత్తర్వులు అమలు కోసం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం ఉన్నతాధికారులకు పలుమార్లు విజ్ఞప్తి చేసినట్టు వెల్లడించారు. లక్షా 34 వేల మందికి ఉద్యోగాలు ఇవ్వడమే కాకుండా చెప్పిన మాట ప్రకారం వారికి రెండు సంవత్సరాలు పూర్తి కాగానే ప్రొబేషన్ డిక్లేర్ చేస్తున్న ముఖ్యమంత్రికి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల అందరి తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి:
దేవాలయ షాపుల వేలంలో.. అన్ని మతాలవారూ పాల్గొనవచ్చు: సుప్రీం కోర్టు