ETV Bharat / city

నామినేషన్లకు మరో అవకాశం..!: ఎస్ఈసీ - SEC Nimmagadda Ramesh kumar news

బలవంతంగా నామినేషన్ల ఉపసంహరణ జరిగిందనే ఫిర్యాదులపై కలెక్టర్ల నుంచి నివేదికలు వచ్చాయని.. త్వరలోనే దీనిపై స్పష్టమైన ప్రకటన వెలువరిస్తామని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ తెలిపారు. పురపాలక ఎన్నికలు సమర్థంగా నిర్వహించేందుకు అన్నిచర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. వాలంటీర్లు ఎన్నికల ప్రక్రియలో పాల్గొనకూడదని ఆదేశించారు.

SEC Nimmagadda Ramesh kumar
ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్
author img

By

Published : Mar 1, 2021, 4:40 AM IST

Updated : Mar 1, 2021, 4:55 AM IST

బలవంతపు చర్యలతో మున్సిపల్‌ ఎన్నికల్లో పోటీ నుంచి విరమించుకున్న, ప్రత్యేక పరిస్థితుల్లో నామినేషన్లు వేయలేకపోయిన వారికి మరో అవకాశం కల్పించే విషయాన్ని ఎన్నికల సంఘం పరిశీలిస్తోందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రమేశ్‌కుమార్‌ వెల్లడించారు. బాధితుల అభ్యర్థనలపై ఒకటి, రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇలాంటి వారిపట్ల సానుభూతితో వ్యవహరించి సంశయ లాభం (బెనిఫిట్‌ ఆఫ్‌ డౌట్‌) కింద మరోసారి అవకాశం కల్పించాలని భావిస్తున్నామని ఎస్‌ఈసీ వివరించారు. ఈ విషయంలో ఎన్నికల సంఘానికి ఉన్న విశేషాధికారాలను మొదటిసారి వినియోగించబోతున్నామని తెలిపారు. పుర ఎన్నికలకు ఏర్పాట్లపై ఎస్‌ఈసీ కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాల అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆదివారం వేర్వేరుగా సమావేశమయ్యారు.

'బలవంతపు ఉపసంహరణలు, దౌర్జన్యాల కారణంగా నామినేషన్లు వేయలేని వారి వినతులపై కలెక్టర్లు నివేదికలు పంపారు. ఇంకొన్ని జిల్లాల నుంచి కూడా వివరాలు తెప్పించి ఎన్నికల సంఘం తుది ఉత్తర్వులు జారీ చేస్తుంది' అని ఎస్ఈసీ వెల్లడించారు. పరిశీలన సమయంలో తిరస్కరణకు గురైన నామినేషన్ల పునరుద్ధరణ, నామినేషన్లే వేయకుండా మరోసారి అవకాశం కల్పించాలన్న అభ్యర్థనలను పరిశీలనలోకి తీసుకోవడం సాధ్యం కాదన్నారు. ఎన్నికలు పూర్తయ్యే వరకు గ్రామ, వార్డు వాలంటీర్ల వ్యవస్థను తాత్కాలికంగా నిషేధిస్తున్నామని ఎస్‌ఈసీ ప్రకటించారు. 'శనివారం తిరుపతిలో నిర్వహించిన ప్రాంతీయ సమావేశంలో పలు రాజకీయ పార్టీల ప్రతినిధులు వాలంటీర్ల సేవలు దుర్వినియోగమవుతున్నట్లు చెప్పారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారుల వివరాలు వాలంటీర్ల దగ్గర ఉన్నాయి. అందువల్ల పార్టీకి, అభ్యర్థికి అండగా నిలిచే అవకాశం ఉందన్న ఉద్దేశంతో వారి సేవలను నిషేధిస్తున్నాం' అని చెప్పారు. రాష్ట్రంలో కొవిడ్‌ అదుపులో ఉన్నా ఎవరూ తేలిగ్గా తీసుకోవద్దని హెచ్చరించారు. రోడ్డుషోలకు అనుమతిస్తామని, ఈ ఖర్చు అభ్యర్థితోపాటు పార్టీ ఖాతాలో చూపాలని స్పష్టం చేశారు.

5లోగా ఓటర్ల స్లిప్పుల పంపిణీ

'ఓటర్ల స్లిప్పులు మార్చి 5లోగా పట్టణాల్లో అన్ని ఇళ్లకూ పంపిణీ చేసేలా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్లను ఆదేశించాం. ప్రతి పురపాలికలోనూ సహాయ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నాం. ప్రజలు వీటికి ఫోన్‌ చేసి ఓటు ఎక్కడ ఉందో తెలుసుకోవచ్చు' అని ఎస్‌ఈసీ చెప్పారు.

మృతి చెందిన వారి స్థానాల్లో 41 నామినేషన్లు

పుర ఎన్నికల్లో నామినేషన్లు వేసి వివిధ కారణాలతో మృతి చెందిన వారి స్థానాల్లో ఆదివారం 41 నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. 9 నగరపాలక, 35 పుర, నగర పంచాయతీల్లో నామినేషన్లు వేసిన వారిలో 59 మంది తర్వాత మరణించారు. దీంతో వారి స్థానంలో అదే పార్టీకి చెందిన వారి నుంచి ఆదివారం నామినేషన్లు స్వీకరించారు.

ఇదీ చదవండి:

రాజకీయ ప్రక్రియకు వాలంటీర్లను దూరంగా ఉంచాలి: ఎస్ఈసీ

Last Updated : Mar 1, 2021, 4:55 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.