ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్‌ను ఎన్నికల విధుల నుంచి తప్పించాలని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్.. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు. ఈ మేరకు సీఎస్ ఆదిత్యనాథ్ దాస్‌కు లేఖ రాశారు. ప్రవీణ్ ప్రకాష్ ఎన్నికల విధుల్లో పాల్గొనకుండా చర్యలు తీసుకోవాలని, వేరే ఏదైనా శాఖకు బదిలీ చేయాలని సీఎస్‌ను ఆదేశించారు. తన సిఫార్స్ లేఖలు పంపినా.. స్పందించని పలువురు ఉద్యోగులపై సకాలంలో చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారని లేఖలో తెలిపారు.
తన ఆదేశాలను పట్టించుకోలేదని..
ఈ నెల 23న కలెక్టర్లు,ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ జరపకుండా చేశారని లేఖలో ఆరోపించారు. జీఏడీకి అధిపతిగా ఉన్న ప్రవీణ్ ప్రకాష్ తన ఆదేశాలను పట్టించుకోలేదని లేఖలో తెలిపారు. ఈ కారణంగా ఎన్నికలను వాయిదా వేస్తూ రీషెడ్యూల్ చేయాల్సి వచ్చిందన్నారు. ఈ నెల 25న అభ్యర్ధుల నుంచి నామినేషన్ల స్వీకరణకు సహకరించలేదని లేఖలో వెల్లడించారు.
ఇదీ చదవండి: