స్థానిక ఎన్నికల నిర్వహణపై రాజకీయ పార్టీలతో సమావేశం ఏర్పాటు చేయడంపై వైకాపా చేసిన ఆరోపణలు ఆశ్చర్యం కలిగించాయని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ అన్నారు. ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఉన్నతాధికారులతో ఎప్పటికప్పుడు చర్చిస్తున్నామన్న ఆయన... ఈనెల 27న వైద్య, ఆరోగ్య, కుటుంబసంక్షేమ శాఖ అధికారులతో గంటపాటు చర్చించామన్నారు. రాష్ట్రంలో కొవిడ్ విస్తృతి, తీసుకుంటోన్న చర్యల గురించి అడిగి తెలుసుకున్నామన్నారు.
ఎన్నికల నిర్వహణ వంటి కీలక చర్యలు తీసుకునే ముందు సంప్రదింపుల ప్రక్రియను గొప్ప అంశంగా కమిషన్ భావిస్తుందని నిమ్మగడ్డ తెలిపారు. సీఈసీ ఉత్తమ పద్ధతులనే ఎస్‌ఈసీ అనుసరిస్తుందన్న స్పష్టం చేశారు. అందులో భాగంగానే రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించామని తెలిపారు. గుర్తింపు పొందిన 19 రాజకీయ పార్టీలను ఆహ్వానించగా 11 పార్టీల ప్రతినిధులు హాజరై తమ అభిప్రాయం తెలిపారన్నారు. జనసేన, జనతాదళ్ సెక్యులర్ పార్టీలు ఈ-మెయిల్ లేఖ ద్వారా అభిప్రాయాలు తెలియజేశాయని నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ వివరించారు.
ఇదీ చదవండి
కొత్తగా స్థానిక ఎన్నికల ప్రక్రియ ప్రారభించాల్సిందే: విపక్ష పార్టీలు