ఎస్ఈసీ గతంలో దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ వ్యాజ్యంలో ప్రస్తుత సీఎస్ ఆదిత్యనాథ్ దాస్‌ను ప్రతివాదిగా చేర్చేందుకు హైకోర్టు అనుమతిచ్చింది. రాష్ట్ర ఎన్నికల సంఘానికి సహకారం అందించాలంటూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఉల్లంఘించిన పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, నాటి ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నిలను శిక్షించాలని కోరుతూ ఎస్ఈసీ రమేశ్‌కుమార్ గతంలో ఈ వ్యాజ్యం దాఖలు చేశారు.
దీనిపై శుక్రవారం విచారణ జరగ్గా..... కోర్టు ఉత్తర్వులు ఇంకా పూర్తిగా అమలు కాలేదని ఎస్ఈసీ తరఫు న్యాయవాది వాదించారు. ఈ నేపథ్యంలో తాజాగా బాధ్యతలు చేపట్టిన సీఎస్ ఆదిత్యనాథ్ దాస్‌ను ప్రతివాదిగా చేర్చేందుకు అనుమతివ్వాలని కోరారు. అందుకు అంగీకరించిన న్యాయస్థానం.. విచారణను సోమవారానికి వాయిదా వేసింది..
ఇదీ చదవండి
ప్రభుత్వ సలహాదారు పదవి నుంచి సజ్జలను తప్పించాలని గవర్నర్‌కు ఎస్ఈసీ లేఖ