ETV Bharat / city

నేటి నుంచి ఏడో తరగతి విద్యార్థులకు బడులు

author img

By

Published : Dec 13, 2020, 10:43 PM IST

Updated : Dec 14, 2020, 3:43 AM IST

రాష్ట్రంలో సోమవారం నుంచి ఏడో తరగతి విద్యార్థులకు బడులు తెరుచుకోనున్నాయి. మిగిలిన తరగతులకు సంక్రాంతి సెలవుల తర్వాతే పాఠశాలలు నిర్వహించాలని సర్కారు యోచిస్తోంది.

schools reopen in ap
schools reopen in ap

రాష్ట్రంలో ఇవాళ్టి నుంచి ఏడో తరగతి విద్యార్థులకు పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఇప్పటికే దశల వారీగా 10, 9, 8 తరగతులకు పాఠశాలలు తెరిచిన ప్రభుత్వం... ఏడో తరగతి ప్రారంభానికీ చర్యలు చేపట్టింది. మిగిలిన తరగతులకు సంక్రాంతి సెలవుల తర్వాతే పాఠశాలలు తెరవాలని సర్కారు యోచిస్తోంది. ఆయా విద్యార్థులను బడికి పంపించేలా తల్లిదండ్రులతో ఉపాధ్యాయులు ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నారు.

పఠనాన్ని ఇష్టపడతాం కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల తల్లిదండ్రుల ద్వారా గ్రంథాలయ పుస్తకాలను పిల్లలకు అందించనున్నారు. మరోవైపు... ప్రభుత్వ ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులంతా ప్రతిరోజు పాఠశాలలకు హాజరు కావాలని ప్రభుత్వం నిర్దేశించింది. అంగన్‌వాడీ కేంద్రాలను సంప్రదించి, ప్రాథమిక స్థాయిలో ప్రవేశాలకు వయస్సు కలిగిన పిల్లలందర్నీ వారు బడుల్లో చేర్పించాల్సి ఉంటుంది.

ఇదీ చదవండి

ప్రభుత్వ బడుల్లో ప్రవేశాలకు టీసీలు అక్కర్లేదు

Last Updated : Dec 14, 2020, 3:43 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.