Sankranthi Special Buses 2021 : సంక్రాంతి పండుగకు అదనపు చార్జీలు లేకుండా బస్సులు నడిపేందుకు తెలంగాణ ఆర్టీసీ రంగం సిద్ధం చేస్తోంది. ఒకట్రెండ్రోజుల్లో అధికార ప్రకటన చేయనున్నట్లు ఆర్టీసీ వర్గాలు చెబుతున్నాయి. ఈ పండుగకు ఎప్పటిలాగే 4,900లకు పైగా ప్రత్యేక బస్సులు నడిపేందుకు టీఎస్‌ఆర్టీసీ కసరత్తు చేస్తోంది. ఇలా 2.50 లక్షల సీట్లను అందుబాటులో ఉంచనుంది. ఇందులో 1600లకు పైగా బస్సులను ఏపీలోని 30 ముఖ్యపట్టణాలకు నడుపుతారు. లక్ష సీట్లకు పైగా ఆంధ్రావైపు వెళ్లే బస్సుల్లో రిజర్వేషన్ సౌకర్యం కల్పిస్తున్నారు.
తగ్గేదేలే అంటున్న ఏపీఎస్‌ఆర్టీసీ..
Sankranthi Special Trains : మరోవైపు ఏపీఎస్‌ఆర్టీసీ దసరాకు ప్రత్యేక సర్వీసులంటూ టికెట్ ధరలను పెంచి బస్సులను నడిపింది. సంక్రాంతికీ ప్రత్యేక బస్సుల్లో 50 శాతం అదనపు టికెట్ ధర ఉంటుందని అక్కడి అధికారులు చెబుతున్నారు.
ప్రత్యేక రైళ్లు..
Sankranthi Special Buses in Telangana : సంక్రాంతి పండుగకు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. జనవరి 9న సికింద్రాబాద్-బెర్హంపూర్, 10న బెర్హంపూర్-సికింద్రాబాద్, జనవరి 3న సుల్లుపేట-నెల్లూర్, నెల్లూర్-సుల్లుపేట, జనవరి 3,5,7న కాకినాడ టౌన్- లింగంపల్లి, జనవరి 4,6,8న లింగంపల్లి-కాకినాడటౌన్, జనవరి 10,12,14,17న కాకినాడటౌన్-లింగంపల్లి, జనవరి 11,13,15,18న లింగంపల్లి-కాకినాడ టౌన్‌కు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే శాఖ వెల్లడించింది. వీటితోపాటు శబరిమలకు జనవరి 4న, 11న కాకినాడటౌన్- ఎర్నాకులం, జనవరి 5, 12న ఎర్నాకులం- కాకినాడటౌన్‌కు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు తెలిపింది.