ETV Bharat / city

'భాషను పరిరక్షించేందుకు తెలుగువారంతా చొరవచూపాలి'

హైదరాబాద్‌ నగరంలోని శిల్పారామంలో ముప్పవరపు ఫౌండేషన్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు జరిగాయి. మాతృభాషతో ముడిపడి ఉన్న పండగలు, సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఉద్బోధించారు.

sankranthi-celebrations-in-silparam-under-muppavarapu-foundation

author img

By

Published : Jan 10, 2020, 8:52 AM IST

'భాషను పరిరక్షించేందుకు తెలుగువారంతా చొరవచూపాలి'

భాషా పరిరక్షణకు తెలుగువారంతా చొరవ తీసుకోవాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. భాషాయజ్ఞం యావత్‌ తెలుగు జాతిదని ఆయన స్పష్టం చేశారు. మాతృభాషతో ముడిపడి ఉన్న పండగలు, సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాలని ఉద్బోధించారు. ముప్పవరపు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబరాలు అబరాన్నంటేలా సాగాయి.

ఈ కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందర రాజన్, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ దత్తాత్రేయ, మంత్రి శ్రీనివాస్ గౌడ్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆర్​.ఎస్​.చౌహాన్, 'ఈనాడు' ఎండీ కిరణ్, మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్, సినీ ప్రముఖులు మహేష్ బాబు, వెంకటేష్, దర్శకుడు రాఘవేందర్ రావు, నిర్మాతలు సురేష్ బాబు, అల్లు అరవింద్ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

సంక్రాంతి సందర్భంగా ముప్పవరపు ఫౌండేషన్ తరపున వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన వారికి అవార్డులను అందించారు. జొన్నవిత్తుల పద్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.