ETV Bharat / city

ఇక సంయుక్త పాలనాధికారులకు..ఇసుక బాధ్యతలు ! - shortage of sand

రాష్ట్రంలో ఇసుక కొరతను అధిగమించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. అందుబాటులో ఉన్న ఇసుకను స్టాక్ యార్డులకు తరలించి... సరఫరా చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల సంయుక్త పాలనాధికారులతో పంచాయితీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇసుక సరఫరాను రోజుకు లక్ష మెట్రిక్ టన్నులకు పెంచేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

రాష్ట్రంలో ఇసుక కొరత
author img

By

Published : Oct 12, 2019, 11:27 PM IST

రాష్ట్రంలో ఇసుక కొరత

రాష్ట్రంలో ఇసుక కొరతను అధిగమించేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టింది. కృష్ణా, గోదావరి నదుల్లో ఇప్పటికీ వరదనీరు ప్రవహిస్తుండటం కారణంగా... ఇసుక తవ్వకాలకు ఇబ్బందులు తలెత్తాయి. ఫలితంగా ప్రైవేటు పట్టాదారు భూముల్లో తవ్వకాలకు అనుమతించిన ప్రభుత్వం... ఆ భూముల్లోని ఇసుక ధరను టన్నుకు రూ.100 పెంచుతూ ఆదేశాలిచ్చింది. సెప్టెంబరు 5 నుంచి అమల్లోకి వచ్చిన నూతన ఇసుక విధానాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు ఆ బాధ్యతల్ని జిల్లా జాయింట్ కలెక్టర్లకు అప్పగించారు.

ఏపీఎండీసీ ద్వారా ఇసుక రీచ్​లలో జరిగే తవ్వకాలు స్టాక్ పాయింట్ల నుంచి విక్రయాలు, సరఫరా తదితర బాధ్యతల్ని పర్యవేక్షించాల్సిందిగా ప్రభుత్వం సంయుక్త పాలనాధికారులకు సూచించింది. సచివాలయంలో అన్ని జిల్లాల జేసీలతోనూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇసుక సరఫరాపై ప్రజల్లో వ్యతిరేకత రాకుండా చూడాలని జేసీలకు సూచించారు.

ప్రస్తుతం రోజుకు 30 వేల మెట్రిక్ టన్నుల ఇసుక మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలోనే లక్ష మెట్రిక్ టన్నులకు పెంచాల్సిందిగా ఆదేశాలు జారీ అయ్యాయి. గోదావరి, కృష్ణా నదుల్లో వరద కొనసాగుతుండటం కారణంగా ఇసుక తవ్వకాలకు ఇబ్బంది ఏర్పడినా... త్వరలో ఇసుక లభ్యత గణనీయంగా పెరుగుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ప్రైవేటు పట్టాభూముల్లో ఉన్న ఇసుక మేటలు తవ్వడం, రిజర్వాయర్లలో డిసిల్టేషన్ ద్వారా ఇసుక తవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.

రాష్ట్రవ్యాప్తంగా ఏటా 2కోట్ల 60లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక అవసరముంటుందని ప్రభుత్వం అంచనాకు వచ్చింది. ప్రభుత్వ ప్రాజెక్టులు, గృహ నిర్మాణాలు, సాగునీటి ప్రాజెక్టులు, రహదారులు... ఇలా వేర్వేరు రంగాల్లో లక్షా 20 వేల మెట్రిక్ టన్నులు అవసరమవుతుందని అధికారులు భావిస్తున్నారు. విజయవాడ, విశాఖ, గుంటూరు, తిరుపతి, రాజమహేంద్రవరం నగరాల్లో ఇళ్ల నిర్మాణాలకు 25 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక అవసరమవుతుందని అంచనా. ఇతర ప్రాంతాల్లోనూ మరో 10లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక అవసరమని భావిస్తున్నారు.

మరో వారం రోజుల్లో రెండు ప్రధాన నదుల్లోనూ వరదలు తగ్గుముఖం పట్టే అవకాశముందని భావిస్తున్న ప్రభుత్వం... రాష్ట్రవ్యాప్తంగా 150 ఇసుక రీచ్​లను తెరవాలని యోచిస్తోంది. మరోవైపు ఇసుక రీచ్​ల వద్ద అక్రమాలు జరగకుండా... సీసీ కెమెరాలు అమర్చి వాటిని జిల్లాలోని కమాండ్ కంట్రోల్ సెంటర్​కు అనుసంధానించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇసుక కోసం ఆన్​లైన్ బుకింగ్ చేసుకోవటం, వాహనాలకు జీపీఎస్ ట్రాకింగ్ అమర్చి వాటిని పర్యవేక్షించనున్నారు.

ఇదీ చదవండీ... 'వారంలోగా ఇసుక సమస్య అధిగమిస్తాం'

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.