తెలంగాణ...సమత హత్యాచార కేసులో ఆదిలాబాద్ ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. సమత హత్యోదంతం కేసులో నిందితులకు మరణ శిక్ష విధిస్తు తీర్పు ఇచ్చింది. హత్యాచారం కేసులో ముగ్గురు నిందితులను ఉరి తీయాలని తీర్పు వెల్లడించింది. నవంబరు 24న కుమురం భీం జిల్లాలో సమతపై హత్యాచారం జరిగింది. నవంబర్ 17న నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. కేసు విచారణకు డిసెంబరు 11న ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేశారు. డిసెంబరు 14న నిందితులపై పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేశారు. డిసెంబరు 23 నుంచి 31 వరకు సాక్షుల విచారణ జరిగింది.
సమత కేసు తీర్పుపై ఆమె భర్త స్పందించారు. తన భార్యను అతి కిరాతకంగా హత్యాచారం చేసి చంపిన దోషులకు శిక్ష పడేలా చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. తీర్పుపై మహిళా సంఘాలు, పోలీసులు హర్షం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి : సుప్రీంలో నిర్భయ దోషికి చుక్కెదురు.. క్యురేటివ్ పిటిషన్ కొట్టివేత