తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన సమత హత్యాచారం కేసులో నిందితులకు ఉరిశిక్ష విధించింది ఆదిలాబాద్‌లోని ప్రత్యేక కోర్టు. ఆ కేసు విచారణ ఇలా సాగింది.
- నవంబర్ 24న తెలంగాణలోని కుమురం భీం జిల్లాలోని ఎల్లాపటర్ ఊళ్లోకి వెళ్లింది. సాయంత్రం భర్త వచ్చేసరికి కనిపించలేదు.
- భార్య కోసం వెతికిన భర్త చివరికి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
- నవంబర్ 25న సమత అత్యంత దయనీయ పరిస్థితిలో శవమై కనిపించింది. హత్యాచారం జరిగిందని పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
- నవంబర్ 27న నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
- శాస్త్రీయ పద్ధతిలో ఆధారాలు సేకరించిన పోలీసులు.. విచారణకు ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయాలని విన్నవించారు.
- పోలీసుల వినతి మేరకు డిసెంబరు 11న ఆదిలాబాద్‌లో ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేశారు.
- డిసెంబరు 14న నిందితులపై పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేశారు.
- డిసెంబరు 23 నుంచి 31 వరకు సాక్షుల విచారణ జరిగింది.
- 50 రోజుల పాటు ప్రత్యేక కోర్టులో సమత కేసు విచారణ జరిగింది.
- ప్రత్యేక కోర్టు దోషులకు ఇవాళ మరణ శిక్ష విధించింది.