ETV Bharat / city

హైకోర్టుకు చేరిన సాయికుమార్​ వైద్య పరీక్ష నివేదిక

పోలీసులు అక్రమంగా నిర్బంధించి, కొట్టారనే ఆరోపణల నేపథ్యంలో వెంకట సత్య సాయికుమార్‌కు వైద్య పరీక్షలు చేయించి నివేదికను హైకోర్టుకు ఆసుపత్రి సూపరింటెండెంట్‌ అందజేశారు. ఈ వ్యవహారంపై అఫిడవిట్​ వేయాలని పిటిషనర్​ను ఆదేసించిన హైకోర్టు విచారణను ఈనెల 29కి వాయిదా వేసింది.

High Court
హైకోర్టు
author img

By

Published : Jul 28, 2022, 8:34 AM IST

కాకినాడ రెండో పట్టణ పోలీసులు అక్రమంగా నిర్బంధించి, కొట్టారనే ఆరోపణల నేపథ్యంలో వెంకట సత్య సాయికుమార్‌కు వైద్య పరీక్షలు నిర్వహించి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ బుధవారం హైకోర్టుకు నివేదిక ఇచ్చారు. ఆ వివరాలను పరిశీలించిన ధర్మాసనం.. నివేదికను సీల్డ్‌కవర్లో ఉంచాలని రిజిస్ట్రీని ఆదేశించింది. అక్రమ నిర్బంధం, పోలీసులు కొట్టిన వ్యవహారంపై పూర్తి వివరాలతో అఫిడవిట్‌ వేయాలని పిటిషనర్‌ను ఆదేశించింది. విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ ఏవీ శేషసాయి, జస్టిస్‌ గన్నమనేని రామకృష్ణప్రసాద్‌తో కూడిన ధర్మాసనం బుధవారం ఈ మేరకు ఆదేశాలిచ్చింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.