తిరుమలలో బస్సు టికెట్లపై అన్యమత ప్రచారం వివాదంపై ఆర్టీసీ చర్యలు తీసుకుంది. నెల్లూరు జోనల్ స్టోర్స్ కంట్రోలర్ ఎం. జగదీశ్ బాబును సస్పెన్షన్ చేస్తూ ఆదేశాలు వెలువడ్డాయి. ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని ఆర్టీసీ ఎండీ తెలిపారు. తెదేపా హయంలోని ప్రకటనలతో కూడిన టికెట్ రోల్స్ ను జారీ చేయటంపై వివాదం తలెత్తింది. ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు లేకుండా తిరుమల డిపోకు రోల్స్ జారీ చేసినట్లు విచారణలో గుర్తించారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకుగాను క్షమశిక్షణ చర్యలు చేపట్టారు.
ఇదీ చదవండి : తిరుమలలో అన్యమత ప్రచారం... రాజకీయ దుమారం