ETV Bharat / city

బదిలీ చేసినందుకు బాధ లేదు: ఆర్టీసీ మాజీ ఎండీ ప్రతాప్

ఆర్టీసీ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేశానని ఆర్టీసీ మాజీ ఎండీ మాదిరెడ్డి ప్రతాప్ అన్నారు. సంస్థ అభివృద్ధి కోసం ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా పని చేశానని అన్నారు. ఆర్టీసీలో డిజిటల్ చెల్లింపుల విషయంపై వస్తున్న ఆరోపణలు వాస్తవం కాదన్నారు.

author img

By

Published : Jul 13, 2020, 1:17 PM IST

Updated : Jul 14, 2020, 6:13 AM IST

rtc ex md madhireddy prathap
rtc ex md madhireddy prathap

ఆర్టీసీ అభివృద్ధికి, రాష్ట్ర ప్రజలకు మెరుగైన సేవల కోసం కృషి చేశానని ఆర్టీసీ మాజీ ఎండీ మాదిరెడ్డి ప్రతాప్ అన్నారు. ఆర్టీసీ ఎండీ నుంచి ఏపీఎస్పీ బెటాలియన్‌ ఏడీజీగా బదిలీ అయిన ఆయన.. గత ఆరు నెలల్లో చేపట్టిన ప్రాజెక్టుల వివరాలను సోమవారం విజయవాడలో విలేకరుల సమావేశంలో వివరించారు. తన బదిలీ ఉత్తర్వులు వచ్చాయని తెలిసిందన్న ఆయన... ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా పని చేశాననే సంతృప్తి కలిగిందని తెలిపారు. కొవిడ్ ప్రత్యేక పరిస్థితుల్లో డిజిటల్ చెల్లింపులకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చేలా చర్యలు తీసుకున్నామని... దీంతో మంచి ఫలితాలు వచ్చాయని అన్నారు. సంస్థ ఉద్యోగులను వైరస్ బారిన పడకుండా చూడగలిగామని వివరించారు.

'నా 26 ఏళ్ల కెరీర్‌లో అనేక ఉన్నత పదవులు అధిరోహించా. ఈ రోజుకూ ఎక్కడా సొంతంగా ఫ్లాట్‌ లేని అధికారిని అని గర్వంగా చెప్పగలను. ఆర్టీసీ ఎండీగా 6 నెలల్లో అనేక కొత్త ఆలోచనలను తెరపైకి తెచ్చా. ఇంతలో బదిలీ అయింది. సీఎం ఏ దృష్టితో బదిలీ చేశారో తెలియదు. ఆయన కోణం వేరేలా ఉండొచ్చు. ఆ నిర్ణయాన్ని స్వీకరించి, పాటించాలి. గత వారం కొవిడ్‌ నిర్ధారణ పరీక్షల కోసం ఆర్టీసీ బస్సులను ‘సంజీవిని’గా మార్చి ఆరంభించాం. అది చూసి వైఎస్‌ విజయమ్మ మెచ్చుకుని మర్నాడు నాకు వైఎస్‌ఆర్‌ జయంతి కేకు పంపారు. అదేరోజు రాత్రి నాకు బదిలీ ఉత్తర్వులు వచ్చాయి’ - మాదిరెడ్డి ప్రతాప్, ఆర్టీసీ మాజీ ఎండీ

అది నాకు పునర్జన్మ...

‘నాడు చిత్తూరు జిల్లాలో రచ్చబండకు వైఎస్‌తో ఎవరు వెళ్లాలని ముందు రోజు రాత్రి సీఎంవో కార్యదర్శి సుబ్రమణ్యం నాతో మాట్లాడారు. సీఎంతో పాటు నన్ను వెళ్లమన్నారు. మళ్లీ వెంటనే తానే వెళ్తానని ఆయన చెప్పారు. అది నాకు పునర్జన్మ లాంటిది’ అని ప్రతాప్ తెలిపారు.

విజయవాడలో బస్‌ మెట్రో కారిడార్‌
విజయవాడ పరిధిలో బస్‌ మెట్రో ఎలివేటర్‌ కారిడార్‌ నిర్మాణానికి సమగ్ర పథక నివేదిక (డీపీఆర్‌) సిద్ధం చేస్తున్నామని ప్రతాప్‌ తెలిపారు. రూ.30 లక్షలతో అర్బన్‌ మాస్‌ ట్రాన్సిట్‌ కంపెనీ (యూఎంటీసీ) సహకారంతో తయారు చేస్తున్నట్లు తెలిపారు. కిలోమీటరుకు రూ.40 కోట్ల చొప్పున ఖర్చవుతుందని ఎల్‌అండ్‌టీ సంస్థ అంచనా వేసిందని చెప్పారు. విజయవాడలో రూ.4,200 కోట్లతో ఈ ప్రాజెక్టు చేపట్టవచ్చని చెప్పారు.

ఇదీ చదవండి:

ఏపీయస్​ఆర్టీసీ ఎండీ మాదిరెడ్డి ప్రతాప్ బదిలీ

Last Updated : Jul 14, 2020, 6:13 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.