రవాణా శాఖ మంత్రి పేర్ని నానికి ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ (ఈయూ) నేతలు లేఖ రాశారు. ఆర్టీసీ ఉద్యోగులకు కరోనా సోకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని... ఇప్పటికే 30 మంది సిబ్బందికి కరోనా సోకినట్లు యాజమాన్యం ప్రకటించినట్లు లేఖలో పేర్కొన్నారు. కడప డిపోలో మహిళా కండక్టర్ కరోనాతో మరణించారని... డిపోలు, గ్యారేజీల్లోని ఉద్యోగులంతా ఆందోళన చెందుతున్నారని లేఖలో తెలిపారు.
ఆర్టీసీ సిబ్బందికి వెంటనే కరోనా పరీక్షలు నిర్వహించాలని... శానిటైజర్లతో పాటు మాస్కులు సరఫరా చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీ ఉద్యోగులకు రూ.50 లక్షల బీమా సౌకర్యాన్ని వర్తింపజేసి... ట్రాఫిక్, గ్యారేజ్ సిబ్బందికి తాత్కలికంగా బ్రీత్ ఎనలైజర్ పరీక్షలు ఆపాలని కోరారు.
ఇదీ చదవండి: