Ceiling Falls On the Students: తెలంగాణలోని హనుమకొండ జిల్లా హసన్ పర్తి మండలంలోని జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలల్లో పెను ప్రమాదం తప్పింది. 10 వ తరగతి గదిలో పైకప్పు పెచ్చులు ఊడి పడ్డాయి. ఈ ఘటనలో ఐదుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి. తక్షణమే వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. స్వల్ప గాయాలతో విద్యార్థులు బయటపడ్డారు.
ఈ ఘటనతో తరగతి గదిలో ఉన్న విద్యార్థులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. భయాందోళనతో బయటకు పరుగులు తీశారు. ఎవరికీ తీవ్రమైన గాయాలు కాకపోవడంతో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఊపిరిపీల్చుకున్నారు. భవనం చాలా సంవత్సరాల క్రితం కట్టింది కావడంవల్లే పెచ్చులూడి పడ్డాయని ఉపాధ్యాయులు తెలిపారు.
తక్షణమే భవనానికి మరమ్మతులు చేపట్టారని.. త్వరలో కొత్త భవనం నిర్మించే దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఈ ఘటనతో మిగతా విద్యార్థులు మళ్లీ పెచ్చులు ఊడి మీద పడతాయేమోనని ఆందోళన చెబుతున్నారు.
ఇదీ చదవండి: