ETV Bharat / city

RIMS: రచ్చకెక్కిన తెలంగాణలోని రిమ్స్‌ ఆసుపత్రి వ్యవహారం - Rims latest updaets

తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్‌ రిమ్స్‌ (RIMS) ఆసుపత్రిలో రోగులకు చికిత్సలు అందించడంలో నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఇటీవల గడువు తీరిన ఇంజెక్షన్లు రోగులకు ఇచ్చే ప్రయత్నం చేయడం కలకలం రేపింది. రోగుల బంధువులు ఆందోళన నిర్వహించారు.

Rims expire injections incident
రచ్చకెక్కిన రిమ్స్‌ ఆసుపత్రి వ్యవహారం
author img

By

Published : Jun 15, 2021, 5:07 PM IST

రచ్చకెక్కిన రిమ్స్‌ ఆసుపత్రి వ్యవహారం

తెలంగాణలోని ఆదిలాబాద్​ రిమ్స్‌ (RIMS) ఆసుపత్రి మూడో అంతస్తులో పురుషుల మెడికల్‌ వార్డులో చికిత్సల కోసం చేరిన వారికి అక్కడి సిబ్బంది గడువు తీరిన సెఫట్రియాక్జాన్‌ యాంటీ బయాటిక్‌ సూదిమందును ఇచ్చే ప్రయత్నం చేశారు. బాధితులందరి వద్ద ఇంజెక్షన్లలో ఈ సూదిమందు ఇచ్చే సందర్భంలో వాయిల్‌ను పరిశీలించగా గడువు తీరిన విషయం వెలుగుచూసింది.

ఈ వ్యవహారం కలెక్టర్​ సిక్తాపట్నాయక్​కు ఫిర్యాదు చేసే వరకు వెళ్లింది. రోగి బంధువులు సైతం సిబ్బంది నిర్లక్ష్యంపై టూటౌన్‌ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ విషయమై విచారణ ప్రారంభమైంది. మరోవైపు రిమ్స్‌ (RIMS) ఆసుపత్రి డైరెక్టర్‌ నిర్వాకంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రిమ్స్‌ (RIMS)కు వచ్చేది పేదలేనని, వారికి మెరుగైన సేవలందించేలా చూడాలని స్థానికులు కోరుతున్నారు.

ఇదీ చూడండి:

Viveka Murder Case: ఇంటి పరిసర ప్రాంతాల్లో భద్రత పెంచండి: వివేకా కుమార్తె సునీత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.