ETV Bharat / city

రూ.50వేలు ఇవ్వాలంటూ డిమాండ్...పోలీసుల అదుపులో రిపోర్టర్

నేను క్రైం రిపోర్టర్ ను... లాక్ డౌన్​లో క్లినిక్ ఎలా తెరిచావ్... ఫొటోలు తీసి ప్రచురిస్తాను.. ఇవి ఓ రిపోర్టర్ బెదిరింపులు. కృష్ణా జిల్లా భవానీపురం ఊర్మిళానగర్​కు చెందిన ఆర్​ఎంపీని రిపోర్టర్ బెదిరించి ఏకంగా రూ.50వేలకు ఎసరు పెట్టాడు. దీంతో చేసేదేం లేక బాధితుడు రూ. 12వేలు సమర్పించుకున్నాడు. అయితే మరోమారు రూ.5వేలు ఇవ్వాలంటూ ఒత్తిడి చేయగా బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.

reporter
reporter
author img

By

Published : Aug 30, 2020, 10:51 PM IST

క్రైం రిపోర్టర్ పేరుతో ఆర్‌ఎంపీని బెదిరించిన ఓ వ్యక్తిని కృష్ణా జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భవానీపురం ఊర్మిళానగర్ కు చెందిన ఆర్‌ఎంపీ సైదయ్యను లాక్ డౌన్ అమల్లో ఉండగా క్లినిక్ ఎలా తెరిచావంటూ జి. కొండూరుకు చెందిన విజయ్ భాస్కర్ రెడ్డి రిపోర్టర్ బెదిరించాడు. రూ.50 వేలు ఇవ్వాలని డిమాండ్ చేసి రూ.12వేలను వసూలు చేసినట్లు బాధితుడు తెలిపాడు. ఫొటోలు ప్రచురిస్తానని చెప్పి మరోమారు రూ. 5వేలు డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు భవానీపురం పోలీసులను ఆశ్రయించాడు. ఆర్‌ఎంపీ సైదయ్య ఫిర్యాదు మేరకు విజయ్ భాస్కర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు.

ఇదీ చదవండి

విద్యుత్​ కాంతుల వెలుగులో కనకదుర్గ పై వంతెన సొగసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.