ETV Bharat / city

relaxation to employees: ఏపీ నుంచి తెలంగాణకు రిలీవ్‌ అయిన ఉద్యోగులకు సుప్రీంకోర్టులో ఊరట - employees

relaxation-to-employees-who-releaved-from-andhra-pradesh-to-telangana
ఏపీ నుంచి తెలంగాణకు రిలీవ్‌ అయిన ఉద్యోగులకు సుప్రీంకోర్టులో ఊరట
author img

By

Published : Dec 15, 2021, 12:19 PM IST

Updated : Dec 15, 2021, 1:34 PM IST

12:16 December 15

3 వారాల్లోపు పెండింగ్‌ జీతాలు చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశం

relaxation to employees: ఆంధ్రప్రదేశ్​ నుంచి తెలంగాణకు రిలీవ్‌ అయిన 12 మంది ఉద్యోగులకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. వారికి 3 వారాల్లోపు పెండింగ్ జీతాలు చెల్లించాలని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. అలాగే సర్వీసు బ్రేక్‌ లేకుండా క్రమబద్ధీకరించాలని తెలిపింది. తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు కోర్టు ఖర్చులు చెల్లించాలని స్పష్టం చేసింది. ఒక్కో రాష్ట్రం ఒక్కో అభ్యర్థికి రూ.10 వేలు చొప్పున చెల్లించాలని.. అలాగే కోర్టుకు రాని మిగిలిన అభ్యర్థులకు కూడా పోస్టింగ్‌ ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

ఇటీవలే ఏపీ నుంచి రిలీవ్ అయిన ఉద్యోగులు సర్వీసు క్రమబద్ధీకరణ, పెండింగ్‌ జీతాలపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వీరి తరఫున అనుమోలు వెంకటేశ్వరరావు వాదనలు వినిపించారు.

ఇదీ చూడండి:

పశ్చిమ గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..వాగులో పడ్డ ఆర్టీసీ బస్సు, 8 మంది మృతి

Last Updated : Dec 15, 2021, 1:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.