ETV Bharat / city

తెలంగాణ: కొత్తవిధానానికి బ్రేక్​​... పాతపద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు

తెలంగాణలో సోమవారం నుంచి పాత పద్ధతిలోనే..వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు జరగనున్నాయి. ఎలాంటి ముందస్తు స్లాట్‌ బుకింగ్‌ లేకుండా కార్డ్‌ విధానంలో సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలో రిజిస్ట్రేషన్లు చేపట్టనున్నారు. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ప్రజలు ఇబ్బందులు పడకుండా ఈ నిర్ణయం తీసుకున్నామన్న ప్రభుత్వం... రిజిస్ట్రేషన్లు సులువుగా, వేగంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది.

author img

By

Published : Dec 20, 2020, 5:38 PM IST

కొత్తవిధానానికి బ్రేక్​​... పాతపద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు

తెలంగాణలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు మళ్లీ పాత పద్ధతిలోనే జరగనున్నాయి. ముందస్తు స్లాట్ల బుకింగ్ చేపట్టరాదని, ఆధార్ వివరాలు అడగరాదని హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొంది. హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలా లేక విధివిధానాలు ఖరారు చేసి రిజిస్ట్రేషన్లను చేపట్టాలా అన్న విషయమై రాష్ట్ర ప్రభుత్వం తర్జనభర్జనలు పడింది.

ప్రజల ఇబ్బందుల దృష్ట్యా....

ఇప్పటికే వంద రోజులుగా రిజిస్ట్రేషన్లు నిలిచిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో ఇంకా జాప్యం తగదని ప్రభుత్వం భావించింది. కొత్త విధానానికి అన్ని చిక్కులు తొలిగే వరకు పాతపద్ధతిలోనే రిజిస్ట్రేషన్లను కొనసాగించాలని ముఖ్యమంత్రి కేసీఆర్​ నిర్ణయించారు. ప్రజలు ఇబ్బందులు పడరాదన్న ఉద్దేశంతో సీఎం.. ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు. హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో ముందస్తు స్లాట్ల బుకింగ్ విధానాన్ని ప్రస్తుతానికి నిలుపుదల చేశారు. ఇప్పటికే ఎవరైనా స్లాట్లు బుక్ చేసుకొని ఉంటే వారి రిజిస్ట్రేషన్లు యథావిధిగా జరుగుతాయని స్పష్టం చేశారు. ఇకనుంచి ఎలాంటి ముందస్తు స్లాట్ల బుకింగ్ విధానం లేకుండా కార్డ్ పద్ధతిలో ప్రస్తుతానికి వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు జరుగుతాయని తెలిపారు.

సాఫీగా, వేగంగా జరిగేలా...

సోమవారం నుంచి అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు జరగనున్నాయి. ఈ మేరకు అవసరమైన చర్యలు తీసుకోవాలని స్టాంపులు-రిజిస్ట్రేషన్ల శాఖకు సీఎస్​ ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా రిజిస్ట్రేషన్లు సాఫీగా, వేగంగా జరిగేలా చూడాలని స్పష్టం చేశారు. సీఎస్​ ఆదేశాలకు అనుగుణంగా స్టాంపులు- రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ శేషాద్రి...రిజిస్ట్రార్లకు సర్క్యులర్ జారీ చేశారు. ప్రభుత్వ నిర్ణయం నేపథ్యంలో కార్డ్ విధానంలో రిజిస్ట్రేషన్లు చేయాలని, విధివిధానాలను పూర్తిస్థాయిలో పాటించాలని తెలిపారు.

ప్రభుత్వ నిర్ణయం నేపథ్యంలో ఇప్పటి వరకు జరిగిన తరహాలోనే వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు జరగనున్నాయి. అయితే అనుమతి లేని, అనధికారిక, క్రమబద్ధీకరణ కాని ప్లాట్ల రిజిస్ట్రేషన్ చేపట్టబోమని ప్రభుత్వం గతంలో స్పష్టం చేసింది. తాజా పరిణామాల నేపథ్యంలో అటువంటి ప్లాట్ల రిజిస్ట్రేషన్ అనుమతిస్తారా... లేదా అన్న విషయమై స్పష్టత రావాల్సి ఉంది.

ఇదీ చూడండి: పది మంది పని.. చేసింది ఒక్కడే.. అదీ ఆరుపదుల వయసులో..

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.