ETV Bharat / city

MPP elections : ఎంపీపీ ఎన్నికలు వాయిదా పడిన చోట మళ్లీ నోటిఫికేషన్‌ - re notification for MPP elections

నిర్దేశించిన గడువులోగా మండల పరిషత్‌ అధ్యక్ష, ఉపాధ్యక్షుల, కో-ఆప్షన్‌ సభ్యుల ఎన్నికలు నిర్వహించని చోట రాష్ట్ర ఎన్నికల సంఘం మళ్లీ నోటిఫికేషన్‌ ఇవ్వనుంది. కలెక్టర్ల నివేదికలు పరిశీలించాక ఎన్నికల కమిషనర్‌ నిర్ణయం తీసుకోనున్నారు.

ఎంపీపీ ఎన్నికలు వాయిదా పడిన చోట మళ్లీ నోటిఫికేషన్‌

author img

By

Published : Sep 26, 2021, 9:36 AM IST

నిరవధిక వాయిదా పడిన చోట సాధ్యమైనంత త్వరలో మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం యోచిస్తోంది. 649 ఎంపీపీ స్థానాలకు శుక్రవారం ఎన్నికల ప్రక్రియ నిర్వహించగా 15 చోట్ల వాయిదా పడ్డాయి. ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్‌ ప్రకారం శనివారం మళ్లీ ఎన్నికల ఏర్పాట్లు చేశారు. ఏడు చోట్ల ఎంపీపీ, ఉపాధ్యక్షుల ఎన్నికలను అధికారులు విజయవంతంగా పూర్తి చేశారు. మరో ఎనిమిది చోట్ల కోరం లేని కారణంగా, సభ్యుల గైర్హాజరుతో ఎన్నికలను నిరవధికంగా వాయిదా వేశారు. ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్‌ ప్రకారం శుక్ర, శనివారాల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలి. సాధ్యం కాని చోట ఎన్నికలు నిరవధిక వాయిదా వేసి ఎన్నికల సంఘానికి నివేదిక పంపాలి.

20 చోట్ల ఉపాధ్యక్షుల ఎన్నిక వాయిదా...

రాష్ట్రంలో 20 చోట్ల మండల పరిషత్‌ ఉపాధ్యక్షుల ఎన్నిక నిరవధిక వాయిదా పడింది. శుక్రవారం వాయిదా పడిన 30 స్థానాలకు శనివారం ఎన్నికలు నిర్వహించి.. పది చోట్ల ఉపాధ్యక్షులను సభ్యులు ఎన్నుకున్నారు. కోరంలేని కారణంగా మిగిలిన చోట్ల అధికారులు వాయిదా వేశారు. శుక్రవారం వాయిదా పడిన 10 కో-ఆప్షన్‌ సభ్యులకు 4 చోట్ల శనివారం ఎన్నిక జరిగింది. మిగిలిన 6 చోట్ల వాయిదా వేశారు.

ఇదీచదవండి.

అనంత జడ్పీ ఛైర్‌పర్సన్‌ స్వామిభక్తి.. ‘ప్రత్యక్ష దైవం జగన్‌’పై ప్రమాణం..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.