నామినేషన్లు వేయని 12 పంచాయతీలు, 725 వార్డుల్లో మళ్లీ ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్లు వేయని సర్పంచ్, వార్డు స్థానాలకు మరోసారి ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ నెల 15న పోలింగ్ నిర్వహించాలని ఎస్‌ఈసీ నోటిఫికేషన్ విడుదల చేసింది. శ్రీకాకుళం, విశాఖ, ప్రకాశం, నెల్లూరు, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో 12 సర్పంచ్ స్థానాలకు, రాష్ట్రవ్యాప్తంగా మరో 725 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
గత ఎన్నికల్లో పలు కారణాలతో నామినేషన్లు వేయని పంచాయతీల వివరాలను కలెక్టర్లు ఎస్‌ఈసీకి పంపారు. మరోసారి ఎన్నికల కోసం ఎస్‌ఈసీ రమేశ్ కుమార్ ప్రకటన విడుదల చేశారు. సర్పంచ్, వార్డు స్థానాల కోసం ఈ నెల 4 నుంచి 6 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 7న నామినేషన్ల పరిశీలన, 10న ఉపసంహరణ.. అదేరోజు మధ్యాహ్నం 3 తర్వాత పోటీలోని అభ్యర్థుల జాబితా విడుదల చేయనున్నారు. ఈ నెల 15న పోలింగ్ ముగిశాక ఓట్ల లెక్కింపు, విజేతల ప్రకటన జరుగుతుంది.
ఇదీ చదవండి: మున్సిపోల్స్: నామినేషన్ల ఉపసంహరణకు నేడే ఆఖరు